జగన్‌పై హత్యాయత్నం కేసులో కీలక పరిణామాలు ...

Srinivasa Rao
x
Srinivasa Rao
Highlights

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ విశాఖ నుంచి హైదరాబాద్‌‌కు చేరింది. కీలక ఆధారాల సేకరణే లక్ష్యంగా NIA విచారణ ముమ్మరం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కస్టడీలోకి తీసుకున్న NIA బృందం తొలిసారిగా నిందితుడితో కలిసి హత్యాయత్నం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించింది.

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణ విశాఖ నుంచి హైదరాబాద్‌‌కు చేరింది. కీలక ఆధారాల సేకరణే లక్ష్యంగా NIA విచారణ ముమ్మరం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కస్టడీలోకి తీసుకున్న NIA బృందం తొలిసారిగా నిందితుడితో కలిసి హత్యాయత్నం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించింది.

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో NIA విచారణ ముమ్మరం చేసింది. ఈ ఘటనలో సిట్ నుంచి స్వాధీనం చేసుకున్న ఫైళ్లను పరిశీలించిన NIA బృందం నిందితుడు శ్రీనివాసరావు నుంచి మరింత సమాచారాన్ని రాబట్టాలని నిర్ణయించింది. నిందితుడు కస్టడి ముగిసే లోపు కీలకమైన సమచారాన్ని రాబట్టే దిశగా రెండో రోజు విచారించారు. శ్రీనివాసరావు వెల్లడించిన అంశాల ఆధారంగా హత్యాయత్నం జరిగిన ప్రదేశాన్ని నిందితుడితో కలిసి దర్యాప్తు బృందం పరిశీలించింది. హత్యాయత్నం జరిగిన ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌తో పాటు ఫ్యూజన్‌ ఫుడ్స్ రెస్టారెంట్‌ను పరిశీలించారు.

హత్యాయత్నానికి ఉపయోగించిన కోడి కత్తిని ఎక్కడ దాచాడు ? ఎలా లోనికి తెచ్చాడు ? ఎవరి కంట పడకుండా ఎక్కడ భద్రపరిచాడు? ఈ ఘటనలో ఎవరైన సహకారం అందించారా ? అనే దానిపై నిందితుడు ఇచ్చిన సమాచారాన్ని బట్టి పరిశీలించారు. ఇదే సమయంలో సిట్ విచారణలో పేర్కొన్న రెండు కత్తుల విషయాన్ని కూడా ప్రస్తావించారు. దీంతో పాటు రెస్టారెంట్‌లో కత్తులను వేడి నీటిలో మరిగించినట్టు వచ్చిన వార్తలపై విచారణ జరిపినట్టు సమాచారం.

నిందితుడు ప్రస్తుతం చెబుతున్న మాటలు గతంలో వెల్లడించిన అంశాలకు భిన్నంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోకి కత్తులను ఎలా తెచ్చారు ? క్యాంటిన్‌లో నుంచి వీఐపీ లాంజ్‌లోకి తీసుకెళ్లే సమయంలో ఎలా జాగ్రత్తపడ్డాడనే దానిపై ఎన్ఐఏ అధికారులు దృష్టి సారించినట్టు సమాచారం. ఇదే సమయంలో హత్యాయత్నం అనంతరం స్వాధీనం చేసుకున్నట్టు చెబుతున్న లేఖను ఎవరు? ఎప్పుడు? ఎక్కడ రాశారనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

అంతకు ముందు కేసు విచారణ పురోగతిని దర్యాప్తు బృందం NIA ఉన్నతాధికారులకు వివరించింది. మరింత దర్యాప్తు కోసం నిందితుడిని హైదరాబాద్‌ తరలించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోరింది. దీంతో శ్రీనివాసరావును హైదరాబాద్ తరలించేందుకు ఉన్నతాధికారులు అనుమతిచ్చారు. నిందితుడు శ్రీనివాసరావును విశాఖ నుంచి హైదరాబాద్‌ తరలించిన పోలీసులు నగరంలోని NIA కార్యాలయానికి తీసుకొచ్చారు. మిగిలిన ఐదు రోజుల పాటు ఇక్కడే విచారించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అత్యంత కీలకమైన కేసు కావడంతో NIA కార్యాలయం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories