ఎమ్మెల్యే రాజాసింగ్‌ దాడి వివాదంలో కొత్త కోణం

ఎమ్మెల్యే  రాజాసింగ్‌ దాడి వివాదంలో కొత్త కోణం
x
Highlights

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసుల దాడి వివాదంలో కొత్త కోణం వెలుగు చూసింది. తనను తానే రాయతో మోదుకొని.. రాజాసింగ్ హైడ్రామాకు తెరదీశారని పోలీసులు...

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసుల దాడి వివాదంలో కొత్త కోణం వెలుగు చూసింది. తనను తానే రాయతో మోదుకొని.. రాజాసింగ్ హైడ్రామాకు తెరదీశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా పోలీసులు విడుదల చేశారు. ఈ వీడియో వెలుగులోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాణి అవంతిభాయ్‌ విగ్రహ నిర్మాణానికి యత్నించడంతో అక్కడ వివాదం చోటు చేసుకుంది. విగ్రహ ఏర్పాటును పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ తన మద్దతుదారులతో కలిసి ఆందోళనకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. ఈ ఘర్షణలో రాజాసింగ్ తలకు గాయమైంది..

ఆయనను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రాజాసింగ్‌పై పోలీసుల దాడి ఘటనను లక్షణ్ ఖండించారు.. ఓ ప్రజాప్రతినిధిని రక్తం వచ్చేలా కొట్టడం దారుణమన్నారు. అయితే రాజాసింగ్‌పై దాడి ఘటనలో తాజాగా కొత్త కోణం వెలుగు చూసింది. అసలు రాజాసింగ్‌పై పోలీసులు దాడి చేశారనడంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టమైంది. తనను తాను రాయితో గాయపరుచుకున్న రాజాసింగ్ ఆయనపై తామే దాడికి పాల్పడినట్టు కొత్త నాటకానికి తెరదీశారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

మరోవైపు ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. దేశం కోసం పోరాడిన పోరాట యోధుల విగ్రహం పెట్టడం తప్పాఅని ప్రశ్నించారు. ప్రతి రెండు సంవత్సరాలు విగ్రహాన్ని తొలగించి.. కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని.. అందులో భాగంగానే కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న సమయంలో.. పోలీసులు తనపై దాడి చేశారని ఆయన పేర్కొన్నారు.. ప్రజాప్రతినిధి అని చూడకుండా.. నోటికి వచ్చిన బూతులు తిడుతూ అనైతికంగా వ్యవహరించారన్నారు. ధర్మం కోసం దేశం కోసం పోరాటం చేస్తున్న తనను చంపడానికి ప్లాన్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. మరోవైపు పోలీసులు రిలీజ్ చేసిన వీడియోపై స్పందించిన ఆయన.. తనపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసిన వీడియోను కూడా రిలీజ్ చేయాలన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories