సీఐ సాహసం.. నెటిజన్ల ప్రశంసలు

సీఐ సాహసం.. నెటిజన్ల ప్రశంసలు
x
Highlights

సినిమాలో పోలీసులు అంతా అయిపోయిన తర్వాత వస్తారు. కాని ఇక్కడ మాత్రం సమయానికి వచ్చారు. రెండు నిండు ప్రాణాలు కాపాడారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన...

సినిమాలో పోలీసులు అంతా అయిపోయిన తర్వాత వస్తారు. కాని ఇక్కడ మాత్రం సమయానికి వచ్చారు. రెండు నిండు ప్రాణాలు కాపాడారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన ఘటన తెలిసిన ఎవరైనా ఈ పోలీసుల సాహసాన్ని శభాష్ అనకుండా ఉండలేరు. ఈయన పేరు సృజన్ రెడ్డి. జమ్మికుంట పట్టణ సీఐ. ప్రాణాలకు తెగించి సీఐ సృజన్ ఇద్దరి ప్రాణాలు కాపాడారు. అది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లె గ్రామం. మల్లయ్య, రవీందర్ అనే ఇద్దరు వ్యక్తులు గ్రామంలోని మంచినీళ్ల బావిలో పేరుకుపోయిన మట్టిని తీసేందుకు అందులో దిగారు. అయితే శ్వాస ఆడక అందులోనే ఇరుక్కుపోయారు.

విషయం తెలుసుకున్న సీఐ సృజన్ రెడ్డి వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఏం ఆలోచించకుండా బావిలోకి దిగారు. లోపల ఇరుక్కున్న వారిని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు. సీఐ సృజన్ రెడ్డిన సహసాన్ని గ్రామస్తులు కొనియాడుతున్నారు. ప్రాణాలకు తెగించి ఇద్దరు వ్యక్తులను కాపాడినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సమయస్పూర్తితో సీఐ సృజన్ చేసిన సాహసం వల్ల రెండు ప్రాణాలు నిలిచాయని మడిపల్లె గ్రామస్తులు అంటున్నారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. సీఐ సృజన్ రెడ్డి చూపించిన తెగువకు నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories