లోక్ సభ ఎన్నికలపై ప్రీపోల్ సర్వేలు...తెలంగాణలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్

లోక్ సభ ఎన్నికలపై ప్రీపోల్ సర్వేలు...తెలంగాణలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి రెండో సారి అధికారం చేజిక్కించుకున్న టీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేయనున్నట్లు తాజా...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించి రెండో సారి అధికారం చేజిక్కించుకున్న టీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేయనున్నట్లు తాజా ప్రీపోల్ సర్వేలు వెల్లడించాయి. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీతో పాటు టీడీపీకి ఒక్క సీటు దక్కే అవకాశం లేదని చెప్పుకొచ్చాయి. తెలంగాణలోని 17 సీట్లలో 16 సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంటుందని రిపబ్లిక్ సీ-ఓటరు సర్వే చెబుతుండగా ఇండియా టీవీ సర్వేలో టీఆర్ఎస్ 14, మజ్లిస్ 1, కాంగ్రెస్ రెండు స్థానాలు కైవసం చేసుకుంటుందని వెల్లడించింది.

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల హడావుడిలో నిమగ్నమవుతుండగానే మరో పక్క ప్రీపోల్ సర్వేల ఫలితాలు వెలువరించాయి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ వైపే మెజార్టీ ఓటర్లు మొగ్గు చూపినట్లుగా సర్వే ఫలితాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలకు ఒక్క సీటు కూడా రావని రిపబ్లిక్ సీ ఓటర్ సర్వే ప్రకటించింది. తెలంగాణ మొత్తం 17 స్థానాలకు టీఆర్ఎస్ 16, ఎంఐఎం ఒక సీటు కైవసం చేసుకుంటుందని ప్రకటించింది.

ఇక ఇండియా టీవీ ప్రకటించిన ప్రీపోల్ సర్వేలో మాత్రం కాంగ్రెస్ కు రెండు స్థానాలు కాంగ్రెస్ కు వస్తాయని వెల్లడించింది. టీఆర్ఎస్ కు 14, ఒక స్థానంలో ఎంఐఎం గెలుచుకుంటాయని సర్వే స్పష్టం చేసింది.

ఏబీపీ-సీ ఓటర్ సర్వేలోనూ తెలంగాణలో ఎన్డీఏ, యూపీఏ కూటమికి ఒక్క సీటు కూడా దక్కవని వెల్లడించింది. 17 స్థానాలకు టీఆర్ఎస్ పోటీ చేసే 16 సీట్లను చేజిక్కించుకుంటుందని ఒక స్థానం ఎంఐఎం కైవసం చేసుకుంటుందని ప్రకటించింది. మొత్తమ్మీద కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలుచుకోవని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఎన్నికలు జరిగి ఫలితాలు వెల్లడయితే తప్ప ప్రజల నాడీ ఏ విధంగా ఉందో తేలనున్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories