logo

పోలవరం యూటర్న్‌బాబుకు ఏటీఎం : మోడీ

పోలవరం యూటర్న్‌బాబుకు ఏటీఎం : మోడీ
Highlights

ఏపీ సీఎం చంద్రబాబుకు పోలవరంపై చిత్తశుద్ది లేదని ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. ప్రాజెక్టు అంచనాలు ఎవరికోసం...

ఏపీ సీఎం చంద్రబాబుకు పోలవరంపై చిత్తశుద్ది లేదని ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. ప్రాజెక్టు అంచనాలు ఎవరికోసం పెంచారని ప్రశ్నించారు. రాజమహేంద్రవరం బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన మోడీ, యుటర్న్ బాబుకు పోలవరం ఓ ఏటీఎంలా మారిందన్నారు. బాబు పరిస్థితి బాహుబలి'లో భల్లాలదేవుడిలా ఉందని మోడీ విమర్శించారు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బాబు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన మాటలను ఏపీ ప్రజలు ఎప్పటికీ నమ్మరని విమర్శించారు.'ఏపీ హెరిటేజ్‌ను కాపాడటం తమ పని.. తన హెరిటేజ్‌ను కాపాడుకోవడం చంద్రబాబు పని' అంటూ మోడీ ఎద్దేవా చేశారు. ఇక్కడి ప్రజలు నీతిగా జీవిస్తారని.. చంద్రబాబు మాత్రం వారిని మోసం చేస్తుంటారని దుయ్యబట్టారు.


లైవ్ టీవి


Share it
Top