తన భార్య, కుమారుడి పేరిట ఉన్న ఆస్తులను వెల్లడించిన లోకేష్

తన భార్య, కుమారుడి పేరిట ఉన్న ఆస్తులను వెల్లడించిన లోకేష్
x
Highlights

మంగళగిరి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి, మంత్రి నారా లోకేష్ స్తిర, చర ఆస్తులు, అప్పుల వివారాలను ఎన్నికల అధికారులకు తెలిపారు. తన భార్యా, కుమారుడి పేరిట ఉన్న...

మంగళగిరి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి, మంత్రి నారా లోకేష్ స్తిర, చర ఆస్తులు, అప్పుల వివారాలను ఎన్నికల అధికారులకు తెలిపారు. తన భార్యా, కుమారుడి పేరిట ఉన్న ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో ఆయన వెల్లడించారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రిట్నరింగ్ అధికారికి ఆయన తన ఆస్తులు, అప్పుల వివరాలతో కూడిన అఫిడవిట్‌ను సమర్పించారు. తనపై ఎలాంటి కేసులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన దగ్గర 253 కోట్ల 68 లక్షల విలువైన ఆస్తులు ఉన్నాయని లోకేశ్ అఫిడవిట‌్‌లో పేర్కొన్నారు.

భార్య బ్రాహ్మణి పేరిట 14 కోట్ల 49 లక్షల విలువైన ఆస్తులు, కొడుకు దేవాన్ష్ పేరిట 3 కోట్ల 88 లక్షల విలువైన ఆస్తులున్నాయని అఫిడవిట్ లో లోకేష్ తెలిపారు. తనకు మూడు కార్లు ఉన్నాయని చెప్పారు. హెరిటేజ్‌లో తన పేరిట 47 కోట్ల 32 లక్షల విలువైన షేర్లు. తన భార్య పేరిట 10 కోట్ల 34 లక్షల విలువైన షేర్లు తన కొడుకు పేరిట 1 కోటి 35 లక్షల విలువైన షేర్లు ఉన్నాయని లోకేశ్ పేర్కొన్నారు.

66కోట్ల 76 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని లోకేశ్ అఫిడవిట్‌లో తెలిపారు. తన భార్య పేరిట 18 కోట్ల 74 లక్షలు, తన కొడుకు పేరిట 16 కోట్ల 17 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయన్నారు. ఇక తనకు 5 కోట్ల 72 లక్షలకు పైగా అప్పులు ఉన్నాయని లోకేష్ తెలిపారు. తన భార్య పేరిట 3 కోట్ల 41 లక్షల అప్పులు ఉన్నాయని తెలిపారు. మొత్తానికి 2017లో ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన సమయంలో లోకేష్ ఆస్తులు 273 కోట్ల ఆస్తులు ఉండగా ప్రస్తుతం లోకేశ్ స్థిర, చరాస్తుల విలువ 319 కోట్ల 68 లక్షలుగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories