ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో నారా మనవడు

ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో నారా మనవడు
x
Highlights

ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగమైన 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా జనవరిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేక పోయినప్పటికీ రెండవ...

ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగమైన 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా జనవరిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేక పోయినప్పటికీ రెండవ భాగమైన 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో ఎన్టీఆర్ రాజకీయ జీవితం గురించి జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించబోతున్నారు అని తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మనవడైన నారా దేవాన్ష్ పోషించినట్లు సమాచారం.

అంతేకాక ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ కుమారుడు శౌర్య రామ్ కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులతో బిజీగా ఉన్న చిత్ర బృందం సినిమాను త్వరలో విడుదల చేయనుంది. ఇక బాలకృష్ణ చిన్నప్పటి పాత్రలో 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాలో బాలయ్య రెండవ కూతురైన తేజస్వి మరియు భరత్ కుమారుడు ఆర్యవీర్ కనిపించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories