రాజీనామా పంపింది సీఎంకు మాత్రమే...స్పీకర్‌కు కాదు: మాణిక్యాలరావు

రాజీనామా పంపింది సీఎంకు మాత్రమే...స్పీకర్‌కు కాదు: మాణిక్యాలరావు
x
Highlights

నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందంటూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు రాజీనామా చేసిన...

నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందంటూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, బీజేపీ నేత పైడికొండల మాణిక్యాల రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బుధవారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. తాను రాజీనామా పంపింది సీఎంకు మాత్రమే అని స్పీకర్‌కు ఇంకా పంపలేదని ఎమ్మెల్యే మాణిక్యాలరావు అన్నారు. రాజీనామాను ఆమోదించాల్సిన బాధ్యత సీఎంపై ఉందని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వచ్చానని అన్నారు. తాను చేసిన దీక్ష జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైందని మాణిక్యాలరావు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories