Top
logo

నేడు ప్రోటెం స్పీకర్ ప్రమాణం

Mumtaz Ahmad khan
X
Mumtaz Ahmad khan
Highlights

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారయ్యింది. ఈ నెల 17 నుంచి సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం జరుగనుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సీనియర్ అయిన ముంతాజ్ ఆహ్మద్ ఖాన్ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేయనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారయ్యింది. ఈ నెల 17 నుంచి సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం జరుగనుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సీనియర్ అయిన ముంతాజ్ ఆహ్మద్ ఖాన్ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేయనున్నారు. గవర్నర్ నర్సింహన్ ముంతాజ్ ఆహ్మద్ ఖాన్ చే ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు.

తెలంగాణలో టీఆర్ఎస్ రెండోసారి ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత తొలిసారిగా ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం జరుగనుంది. సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న M.I.M శాసనసభ్యుడు ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ఇప్పటికే ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకున్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్, ముంతాజ్ అహ్మద్ ఖాన్‌తో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

ఈనెల 17న ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన తెలంగాణ శాసనసభ సమావేశం కానుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఒకరి తర్వాత మరొకరు ప్రమాణ స్వీకారం చేస్తారు. దాదాపు 2 గంటల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం జూబ్లీహాలు కౌన్సిల్‌ లాన్స్‌లో నూతన శాసనసభ్యులకు లంచ్‌ ఏర్పాటు చేశారు. అదే రోజున స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ కార్యక్రమాలు ఉంటాయి.

ఈ నెల 18న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. కొత్తగా ఎన్నికైన స్పీకర్‌ను సభానాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతిపక్షనేత స్పీకర్ స్థానానికి తీసుకెళ్తారు. ఆ తర్వాత స్పీకర్ అధ్యక్షతన సభా కార్యకలాపాలు కొనసాగుతాయి. స్పీకర్‌ అధ్యక్షతన బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశమై గవర్నర్‌ ప్రసంగంపై నిర్ణయం తీసుకుంటుంది.

ఈనెల 19న అసెంబ్లీనుద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టడం, చర్చ, ఆమోదం ఉంటాయి.

Next Story