తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వింతలు

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వింతలు
x
Highlights

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వింతలు విశేషాలు బోలెడు కనిపిస్తున్నాయి. మొదటివిడత ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికైన మహిళకు.. రెండు రోజల తర్వాత మూడో కాన్పు...

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వింతలు విశేషాలు బోలెడు కనిపిస్తున్నాయి. మొదటివిడత ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎన్నికైన మహిళకు.. రెండు రోజల తర్వాత మూడో కాన్పు అయ్యింది. నామినేషన్‌ వేసినప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలే ఉన్నా మూడో బిడ్డ రావడంతో ఆమె సర్పంచ్‌గా కొనసాగుతారా..? మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా..? మూడో కాన్పు అయితే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హురాలు కాదని నిబంధనలు చెబుతున్నా గర్భవతిగా ఉన్న సమయంలో నామినేషన్ వేయొచ్చా..? అలాంటి సమయంలో నిబంధనలు ఏం చెబుతున్నాయనే దానిపై ఆసక్తి నెలకొంది.

ఈమె పేరు మహాదేవీ. ఈ నెల 21 న మొదటివిడత పంచాయతీ ఎన్నికల్లో ఈమె జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని గువ్వలదిన్నె గ్రామానికి సంర్పంచ్‌గా ఎన్నికైంది. అయితే నామినేషన్‌ వేసిన సమయంలో ఆమెకు ఇద్దరు పిల్లలుండగా గెలిచిన రెండు రోజున ఆమె మూడో బిడ్డకు జన్మనిచ్చింది. ఎన్నికల ముందు ఆమెకు కాన్పు అయితే పోటీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చేది కానీ అదృష్టం కలిసొచ్చి సర్పంచ్‌గా ఎన్నికైన రెండు రోజుల తర్వాత మూడో బిడ్డను కన్నది.

నామినేషన్‌ వేసే రోజు మహాదేవీ అర్హురాలని ఆనాడు ఆమెకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రవీందర్‌ చెబుతున్నారు. ఈ అంశాన్ని నామినేషన్‌ వేసిన రోజే ఎన్నికల సంఘానికి చేరవేశానని వారి నుంచి అనుమతి పొందాకే మహాదేవీ నామినేషన్‌ ను స్వీకరించినట్లు వెల్లడించారు.

125 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన మహాదేవీ సర్పంచ్‌గా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. గ్రామ సమస్యలు పరిష్కరించడమే తన ముందున్న లక్ష్యమని వివరించారు. మహాదేవీకి మద్దతుగా ఉంటామని గ్రామస్తులు భరోసా ఇస్తున్నారు.

ముగ్గురు సంతానం ఉన్న మహాదేవీ మువ్వలదిన్నెకు సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్‌ పదవితో పాటు మూడో బిడ్డ కూడా వారింట అడుగుపెట్టడంతో మహాదేవీ కుటుంబం సంబరాలు చేసుకుంటోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories