మోడీ క్యాబినెట్ లో 18 మందికి ఒకే సారుప్యత...

మోడీ క్యాబినెట్ లో 18 మందికి  ఒకే సారుప్యత...
x
Highlights

గడ్డం అనేది నేటి యువత ఇదో ఫ్యాషన్ అనుకుంటింది... కానీ ఎందరో రాజకీయ నేతలు సైతం అదే స్టైల్ ఫాలో అవుతున్నారు.. ఒకే మాట..ఒకే బాటగా సాగుతున్న ప్రధాని...

గడ్డం అనేది నేటి యువత ఇదో ఫ్యాషన్ అనుకుంటింది... కానీ ఎందరో రాజకీయ నేతలు సైతం అదే స్టైల్ ఫాలో అవుతున్నారు.. ఒకే మాట..ఒకే బాటగా సాగుతున్న ప్రధాని నరేంద్ర మోడీ.. అమిత్ షాతో సహా కేంద్ర కేబినెట్ లో 18 మంది గడ్డం వాలాలున్నారు. ఇది యాదృచ్చికమా.. సెంటిమెంటా అన్నది అందిరిలో ఆసక్తి కల్గిస్తోంది.. ప్రధాని నరేంద్ర మోడీ..అమిత్ షాతోపాటు పలువురు నేతలు. ఆర్ఎస్ఎస్ తో సుదీర్ఘ అనుబంధం..దేశవ్యాప్తంగా బీజేపీ క్షేత్ర స్థాయి శ్రేణులతో అనుసంధానం.. అపరిమితమైన శక్తి సామర్ధ్యాలు.. విజయకాంక్షతో ముందుకు సాగుతున్న మోడీ..అమిత్ షా ఒకే సారుప్యతతో ముందుకు సాగుతున్నారు. అంతే కాదు ఈ ఇద్దరూ గడ్డం పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు..

కేంద్రంలో కొలువుదీరిన మంత్రిమండలిలోనూ ఇదే సారుప్యత కనిపిస్తోంది. మొత్తం 58 మంది మంత్రుల్లో 18 మంది కేంద్ర మంత్రులు ఓ మోతాదులో గడ్డం మెయింటెన్ చేస్తున్న వారే ఉన్నారు.. విదేశీ వ్యవహారాల మంత్రి జయ్ శంకర్, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్..పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తర్‌ అబ్బాస్‌ నఖ్వీ, పశుసంవర్థకశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తో పాటు స్వతంత్ర హోదా మంత్రుల్లో సంతోష్ గంగ్వార్, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లద్ పటేల్, విమానయాన మంత్రి హర్ దీప్ పూరి ఎప్పుడూ గడ్డంతోనే కనిపిస్తుంటారు.

ఇక సహాయ మంత్రులు కిషన్ రెడ్డి. అశ్వినీ చౌబె. కృష్ణపాల్, గుర్జర్, పురుషొత్తం రూపాల, రాందాస్ అథవాలే బాబుల్ సుప్రియో, అనురాగ్ ఠాకుర్, ప్రతాప్ చంద్ర షడంగి గడ్డం మెయింటేన్ చేస్తున్న వారిలో ఉన్నారు. కేంద్ర మంత్రుల్లో తొలిసారిగా ఇంత మంది గడ్డం పెంచే వారు ఉన్నారు. అయితే ఇది యాదృచ్చికమైన అంశమేనని.. దీనివెనుక ప్రత్యేక కారణాలు అంటూ ఏమీ లేవంటూ బీజేపీ నేతలు అంటున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories