Top
logo

కాంగ్రెస్ నేతలకు సబిత క్లాస్

కాంగ్రెస్ నేతలకు సబిత క్లాస్
Highlights

టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి...

టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి క్లాస్ తీసుకున్నారు. పార్టీ మారవద్దంటూ బుజ్జగించేందుకు వచ్చిన నేతలపై ఆమె విరుచుకుపడ్డారు. 'మిమ్మల్ని నమ్ముకుని పార్టీలో కొనసాగాలా' అంటూ సబితా ఇంద్రారెడ్డి సూటిగా ప్రశ్నించినట్టు సమాచారం. తనను పార్టీ మారవద్దంటున్న మీరు కేటీఆర్‌తో గంటకు పైగా ఏకాంతంగా ఎలా మాట్లాడతారంటూ భట్టీ, ఉత్తమ్‌లను నిలదీసినట్టు తెలుస్తోంది. కేటీఆర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి నెంబర్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టాడంటూ సూటిగా ప్రశ్నించారు. తాజా పరిణామాలతో చేసేదేమి లేక వెనక్కి వచ్చినట్టు సమాచారం. అయితే సీనియర్ నేతగా, పార్టీలో తనదైన గుర్తింపు ఉన్న సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారితే ఇబ్బందులు తప్పవని భావింవచిన వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. అధినేత రాహుల్ గాంధీతో స్వయంగా సబితను మాట్లాడించారు. ఈసందర్భంగా పార్టీలో ఎదురవుతున్న ఇబ్బందులను సబిత వివరించినట్టు సమాచారం. దీంతో ఢిల్లీకి వచ్చి తనను కలవాలంటూ రాహుల్ గాంధీ ఆదేశించారు. రాహుల్ ఆదేశాల మేరకు కాసేపట్లో కుమారుడు కార్తీక్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు .


Next Story


లైవ్ టీవి