Top
logo

ఒంగోలు గ్యాంగ్ రేప్‌ : బాధిత బాలికను పరామర్శించిన మంత్రి బాలినేని

ఒంగోలు గ్యాంగ్ రేప్‌ : బాధిత బాలికను పరామర్శించిన మంత్రి బాలినేని
X
Highlights

అత్యాచారానికి గురైన బాలికను జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఘటనపై ఆరా తీసిన...

అత్యాచారానికి గురైన బాలికను జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఘటనపై ఆరా తీసిన బాలినేని .. తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులను ఆదేశించారు. నిందితుల తరపున ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా జరిగిన ఈ ఘటనను ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదన్నారు. బాధిత బాలికకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడిన మంత్రి బాలినేని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఒంగోలు గ్యాంగ్ రేప్‌ : బాధిత బాలికను పరామర్శించిన మంత్రి బాలినేని


Next Story