మగాళ్ల పండుగ

మగాళ్ల పండుగ
x
Highlights

కొన్ని ఆలయాల్లో నియమాలు కఠినంగా ఉంటాయి. మరికొన్ని చోట్ల వింత ఆచారాలు ఉంటాయి. అలాంటి విచిత్ర సంప్రదాయమే కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లెలోని సంజీవరాయుని ఆలయంలో తరతరాలుగా కొనసాగుతోంది.

కొన్ని ఆలయాల్లో నియమాలు కఠినంగా ఉంటాయి. మరికొన్ని చోట్ల వింత ఆచారాలు ఉంటాయి. అలాంటి విచిత్ర సంప్రదాయమే కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లెలోని సంజీవరాయుని ఆలయంలో తరతరాలుగా కొనసాగుతోంది. ఇంతకీ ఏమిటా ఆచారం?.. అనుకుంటున్నారా.

కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లెలో ఆంజనేయుడినే సంజీవరాయుడిగా కొలుస్తారు గ్రామస్థులు. ఆలయంలో ఓ బండపై ప్రతిష్ఠించిన హనుమంతుడి చిన్న విగ్రహానికి నిత్యాభిషేకాలు, పూజలు నిర్వహిస్తుంటారు. పండుగలు జాతరలు వచ్చాయంటే మహిళలే అమ్మవారికి పొంగళ్లు పెట్టి పూజలు చేయడం సహజం కానీ ఇక్కడి ఆంజనేయ స్వామికి పురుషులే పొంగళ్లు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.

ఏటా సంక్రాంతి పండుగకు ముందు వచ్చే ఆదివారం సంజీవరాయుని సన్నిధిలో కోలాహలం మొదలవుతుంది. ఉదయాన్నే తిప్పాయపల్లెతో పాటు సమీప గ్రామాల్లోని మగాళ్లంతా పొంగళ్లు వండటానికి కావాల్సిన సరంజామా సర్దుకుని గుడిబాట పడతారు. ఆలయప్రాంగణంలో పొయ్యిలను ఏర్పాటు చేసుకుని పొంగళ్లు వండుతారు. వండిన దానిని సంజీవరాయునికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.

పండుగ కంటే పొంగళ్లు పెట్టడమే ఎక్కువగా పాటిస్తారు తిప్పాయపల్లె వాసులు. పంటలు చక్కగా పండి, పశుసంపద బాగా పెరిగి గ్రామం కళకళలాడేందుకు పొంగళ్ల కార్యక్రమం నిర్వహిస్తారు. సంజీవరాయుడికి పొంగళ్లు మగాళ్లే పెట్టాలని ఆలయ శాసనాల్లో ఉందని. అందుకే ఈ ఆచారం ఇక్కడ మొదలైందని గ్రామస్తులు చెబుతుంటారు తాతల కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు ఏడాదంతా ఎక్కడెక్కడ ఉన్నా పొంగళ్ల పండుగ నాటికి మగవాళ్లంతా స్వగ్రామానికి చేరుకుంటారు.

ఇక సంజీవరాయుడి ఆలయంలోకి మగవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఆడవారికి ప్రవేశం ఉండదు. ఆలయం బయట గేటు వద్ద నుంచే మహిళలు దేవున్ని దర్శించుకుంటారు. అంతే కాకుండా స్వామివారికి సమర్పించిన నేవేద్యాన్ని కూడా ముట్టరు. భక్తిశ్రద్ధలతో పొంగళ్లు వండి నైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారికి 101 బిందెలతో అభిషేకం చేస్తారు. అంతేకాదు సంజీవరాయుడికి కానుకలుగా బెల్లం, కొబ్బరి గిన్నెలు గంపల కొద్దీ సమర్పిస్తుంటారు. అలాగే కోరికలు తీరిన తర్వాత స్వామి వారికి వేల రూపాయల్లో చదివింపులు చేస్తుంటారు.


Show Full Article
Print Article
Next Story
More Stories