వారేవ్వా ! ఏమిలక్కు....నెల్లూరు మేయర్ ను వరించిన అదృష్టం...

వారేవ్వా !  ఏమిలక్కు....నెల్లూరు మేయర్ ను వరించిన అదృష్టం...
x
Highlights

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. ప్రస్తుత ఎన్నికల్లో నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ ను కచ్చితంగా అలాంటి అదృష్టమే ఏరి కోరి...

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఏ రూపంలో ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. ప్రస్తుత ఎన్నికల్లో నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ ను కచ్చితంగా అలాంటి అదృష్టమే ఏరి కోరి వరించింది. ఏపీ శాసనసభ ఎన్నికల్లో నెల్లూరు రూర‌ల్ స్థానం నుంచి మేయ‌ర్ అబ్దుల్ అజీజ్ ను అధికార టీడీపీ తమ అభ్యర్ధిగా ఖ‌రారు చేసిన తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇంతకీ నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ ను అదృష్టం ఎలా వరించింది. అజీజ్ నే టీడీపీ అధినేత తమ అభ్యర్థిగా ఎంచుకోడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి.

ఊహకందనిది జరగడమే జీవితం. మనదైన రోజున అదృష్టం వెతుక్కొంటూ వస్తుందనటానికి నిదర్శనమే నెల్లూర్ రూరల్ టీడీపీ అభ్యర్థి అబ్దుల్ అజీజ్ ఎంపిక. రాష్ట్ర ప్రస్తుత ఎన్నికల్లో నెల్లూరు టీడీపీ రూర‌ల్ అభ్యర్థిగా ఖరారై ఆపై వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మారిన ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజకీయ నిర్ణయం ఇప్పుడు నెల్లూరు మేయర్ పాలిట వరంగా మారింది.

వైసీపీ తరపున నెల్లూరు మేయర్ గా గెలిచి ఆ తర్వాత అధికార టీడీపీ పంచన చేరిన మేయర్ అబ్దుల్ అజీజ్ సిటీఎమ్మెల్యే గా పోటీ చేయాలని గత రెండేళ్లుగా ఉవ్విళ్లూరుతున్నారు. సిటీ ఎమ్మెల్యే టికెట్ కోసం ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు అయితే నెల్లూరు సిటీ సీటును ఎన్నికల ప్రారంభంలోనే మేయర్ కాలేజీ గురువు, మంత్రి నారాయణ కు అధినేత డిక్లేర్ చేశారు అంతే మేయర్ ఆశలు ఒక్కసారిగా ఆడియాసలయ్యాయి అంతలోనే నెల్లూరు రూరల్ సీటుకోసం ప్రయత్నించి మరోసారి నిరాశకు గురయ్యారు.

అయితే అంతలోనే అదృష్టం ఆదాల రూపంలో మేయర్ తలుపు తట్టింది. మాజీ మంత్రి ఆదాల ప్రభాకర రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పడంతో అధికారపార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది అంతలోనే తెరుకున్న అధికారపార్టీ నెల్లూరు రూరల్ స్థానంకోసం పలువురి పేర్లు పరిశీలించి బ‌ల‌మైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే మేయర్ అబ్దుల్ అజీజ్ ను తమ అభ్యర్థి గా అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

అయితే నెల్లూరు రూర‌ల్ లో టీడీపీ అభ్యర్థిత్వం సరే సరి. అక్కడి బలాబలాల పరిస్థితిని ఓసారి చూస్తే అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఒకరికి ఒకరు తీసిపోనట్లుగా ఉన్నారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం 2,16,266 మంది ఓటర్లు ఉంటే వారిలో 32వేల పైచిలుకు ముస్లీం సామాజికవర్గం ఓట్లే ఉన్నాయి. అక్కడ నుంచి అదే సామాజిక‌వ‌ర్గానికి చెందిన మేయ‌ర్ అజీజ్ ను బ‌రిలోకి దించడంతో, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గట్టిపోటీనే ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.

గత ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ది ప‌నులు త‌మ‌కు క‌లిసొస్తాయ‌ని అధికార పార్టీ ఆలోచ‌న‌ కాగా వైసీపీ సిట్టింగ్ అభ్యర్థి మాత్రం నియోజకవర్గంలో తనకు ఉన్న పరిచయాలతోపాటు జగన్మోహన్ రెడ్డి కి లభిస్తున్న ఆదరణ సైతం తమకు అనుకూలంగా మారుతుందని వైసీపీ భావిస్తోంది. నెల్లూరు రూరల్ లో బలాబలాల సంగతి ఎలా ఉన్నా గత రెండేళ్లుగా తనకు అందని ద్రాక్షలా మారిన ఎమ్మెల్యే సీటు అనూహ్యంగా తననే వెతుక్కొంటూ రావడంతో అజీజ్ స్పీడ‌ప్ అయ్యారు.

సీటు ఖరారయ్యిందే తడవుగా మేయ‌ర్ కార్పోరేట‌ర్లను, స్థానిక నేత‌ల‌ను క‌లుస్తున్నారు మద్దతు కూడ‌గ‌డుతున్నారు. ముఖ్యమంత్రే స్వయంగాతన అభ్యర్థిత్వాన్ని బ‌హిరంగ స‌భ‌లో ప్రకటించడంతో అజీజ్ రెట్టించిన ఉత్సాహంతో విజయానికి ఉరకలేస్తున్నారు. బ‌ల‌మైన అభ్యర్థిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే శ్రీధ‌ర్ రెడ్డిని ఢీకొట్టేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories