logo
తాజా వార్తలు

తాడిపత్రిలో రెచ్చిపోయిన మట్కా గ్యాంగ్..

Police
X
Police
Highlights

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మట్కా రాయుళ్లు రెచ్చిపోయారు. పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైనే దౌర్జన్యానికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. సీఐతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మట్కా ఆడుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీఐ హమీద్ ఖాన్, కానిస్టేబుల్లు నరేందర్ రెడ్డి, ప్రదీప్ కుమార్, ప్రసాద్ లు సివిల్ దుస్తులు ధరించి ప్రైవేట్ వాహనంలో వచ్చారు. విజయనగర్ కాలనీలో రషీద్ ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు రషీద్ అనుచరులు. దాదాపు 20 మంది కర్రలు, రాళ్లతో పోలీసులపై దాడి చేశారు. పోలీసులమంటూ గుర్తింపు కార్డులు చూపినప్పటికీ ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టారు. పోలీసుల వాహనాన్ని తగులబెట్టారు.

సమాచారం తెలుసుకున్న అనంతపురం జిల్లా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపు నిందితులు పరారయ్యారు. ఇక దుండగుల దాడిలో గాయపడిన అపస్మారక స్థితిలో పడి ఉన్న కడపకు చెందిన సీఐ హమీద్ ఖాన్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులపై దుండగల దాడి రాజకీయంగా కలకలం రేపింది. ప్రజాప్రతినిధుల అండతోనే ఈ దాడి జరిగిందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులపైనే దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.

Next Story