బోరుబావిలో పడిన బాలుడిని కాపాడిని రెస్క్యూ టీం

బోరుబావిలో పడిన బాలుడిని కాపాడిని రెస్క్యూ టీం
x
Highlights

ఉత్తరప్రదేశ్ లో బోరు బావిలో పడిన ఐదేళ్ల బాలుడిని రెస్క్యూటీం కాపాడింది. మథుర సమీపంలో నిరుపయోగంగా ఉన్న బోరుబావిలో నిన్న మధ్యాహ్నం పడిపోయిన బాలుడిని...

ఉత్తరప్రదేశ్ లో బోరు బావిలో పడిన ఐదేళ్ల బాలుడిని రెస్క్యూటీం కాపాడింది. మథుర సమీపంలో నిరుపయోగంగా ఉన్న బోరుబావిలో నిన్న మధ్యాహ్నం పడిపోయిన బాలుడిని రక్షించేందుకు ఎన్టీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. బాలుడు బోరుబావిలో పడినట్లు సమాచారం అందగానే రెండు గంటల వ్యవధిలోనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. వంద అడుగుల లోతులో బాలుడు ఉన్నట్టు గుర్తించి ఇవాళ తెల్లవారు జామున బయటకు తీశారు.

యూపీ మధురా నగర్ లోని షేర్ ఘర్ గ్రామంలో చెట్టు కింద పడిన పండ్లను ఏరుకుంటుండగా నిన్న మధ్యాహ్నం ఐదేళ్ళ బాలుడు సడెన్ గా బోరుబావిలోకి జారిపోయాడు. బోరు బావిలోని పైపు లైన్ ను పట్టుకుని సహాయం కోసం కేకలు వేయడంతో స్థానికులు అలర్ట్ అయ్యారు. అధికారులకు సమాచారం అందించారు. బాలుడి కాపాడేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆపేరేషన్ మొదలు పెట్టారు. ‎ఎనిమిది గంటల పాటు శ్రమించి బాలుడిని ప్రాణాలతో బయటకు తీసారు. రెస్యూ టీం చేపట్టిన ఆపరేషన్ విజయవంతం అయ్యింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

బోరు బావి నుంచి ఇవాళ తెల్లవారుజామున బయటకు తీసిన బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వెంటనే చికిత్స అందించి బాలుణ్ణి ప్రాణాపాయం నుంచి కాపాడారు. బాలుడికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు నిర్ధారించారు. బోరు బావిలో నుంచి మృత్యుంజయుడిగా వచ్చిన చిన్నారిని ఇవాళ డిశ్చార్ చేస్తారు.





Show Full Article
Print Article
Next Story
More Stories