వైసీపీలో చేరిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే

X
Highlights
వైసీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వైఎస్సార్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే....
Chandram21 March 2019 12:16 PM GMT
వైసీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వైఎస్సార్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్‌లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు వైయస్ జగన్. కాగా కాండ్రు కమల కాంగ్రెస్ తరఫున గత2009 ఎన్నికల్లో కాండ్రు కమల ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కొన్ని పరిణామాలతో టీడీపీ గూటీకి చేరారు. ప్రస్తుతం మంగళగిరి సీటు చంద్రబాబు కొడుకు నారా లోకేశ్ కి కేటాయించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న కమల గురువారం వైసీపీ గూటికి చేరారు.
Next Story