న్యూ ఇయర్ పార్టీ లో బిజీగా ఉన్న మహేష్

Mahesh Babu
x
Mahesh Babu
Highlights

కొత్త సంవత్సరం రానే వచ్చింది. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో మామూలు ప్రజలే కాక సినిమా ప్రపంచం కూడా మునిగితెలుతోంది. ఇప్పటికే కొందరు విదేశాలు వెళ్లి వేడుక మొదలుపెట్టారని సమాచారం.

కొత్త సంవత్సరం రానే వచ్చింది. ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో మామూలు ప్రజలే కాక సినిమా ప్రపంచం కూడా మునిగితెలుతోంది. ఇప్పటికే కొందరు విదేశాలు వెళ్లి వేడుక మొదలుపెట్టారని సమాచారం. మరికొందరేమో కొత్త సంవత్సరం వేడుకల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఏం చేయనున్నారు? ఎప్పుడు సమయం చిక్కినా విదేశాల కు హాలిడే కి వెళ్ళిపోయే మహేష్ ఇప్పుడు కూడా కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేయడానికి ఎన్ వై ఈ (NYE) పార్టీలు ప్లాన్ చేశాడు మహేష్.

ఇప్పటికే venue వద్దకు వెళ్లి పోయాడు ఈ 'స్పైడర్' హీరో. 'చిల్లింగ్ ఎట్ # మిక్స్ విత్ బోయ్స్.. ఇదే కొత్త హాట్స్పాట్!" అని సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన మహేష్ దుబాయ్ లో 31 రాత్రి కొత్త సంవత్సర సెలబ్రేషన్స్ అని చెప్పకనే చెప్పాడు. నిజానికి కార్తికేయ పెళ్లికి హాజరు కావాల్సిన మహేష్ బాబు, రాజమౌళి నుండి ఆహ్వానం అందకపోవడంతో దుబాయ్ వెళ్లి పోయాడు అని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా కొత్త సంవత్సరాన్ని దుబాయిలో చాలా గ్రాండ్ గా ఆహ్వానించనున్నాడు మహేష్ బాబు. మరోవైపు 'మహర్షి' సినిమా సెకండ్ లుక్ ను ఇవాళే విడుదల చేయనున్నామని దర్శకుడు వంశీ పైడిపల్లి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories