మహేశ్ ఫాన్స్ ఇక కాలర్ ఎగరేసుకోవచ్చు ..

మహేశ్ ఫాన్స్ ఇక కాలర్ ఎగరేసుకోవచ్చు ..
x
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు అనుకున్నది సాధిచాడు . ఈ సారి గట్టిగా కొడతానని కాలర్ ఎగరేసి మరి చెప్పిన మహేష్... అనుకున్నట్టుగానే ఈ సినిమా మొదటి వారం భారీ...

సూపర్ స్టార్ మహేష్ బాబు అనుకున్నది సాధిచాడు . ఈ సారి గట్టిగా కొడతానని కాలర్ ఎగరేసి మరి చెప్పిన మహేష్... అనుకున్నట్టుగానే ఈ సినిమా మొదటి వారం భారీ వసూళ్ళు అందుకుంది . తొలివారం ముగిసేసరికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డబ్బై ఐదు కోట్ల వసూళ్ళును కొల్లగొట్టింది .

ఇప్పటివరకు మొదటివారం వసూళ్ళు పరంగా టాప్ ర్యాంక్ లు ఒక్కసారి చూసుకుంటే అల్ టైం లిస్టులో మహర్షి నాలుగో స్థానంలో ఉంది . మొదటి మూడు స్థానాల్లో బాహుబలి రెండు పార్ట్లు, రంగస్థలం ,ఖైది నెంబర్ 150 సినిమాలు నిలిచాయి . ఈ సినిమాలు అన్ని మొదటివారంలో డబ్బై ఐదు కోట్ల వసూళ్ళును కొల్లగొట్టాయి .. ఇక మహేష్ బాబు కేరియర్ లో మాత్రం ఫస్ట్ వీక్ కలక్షన్ లలో నెంబర్ వన్ సినిమాగా మహర్షి నిలిచింది .

మహేష్ బాబు 25 వ సినిమాగా తెరకెక్కిన మహర్షి నైజంలో 21 కోట్లను రాబట్టగలిగింది . మహేష్ గత చిత్రాలు అయిన శ్రీమంతుడు ,భరత్ అను నేను సినిమాలు కూడా నైజంలో 20 కోట్లను కొల్లగొట్టాయి .. ఇక ఓవర్సీస్ లో మాత్రం వసూళ్ళ కొంచం తగ్గాయనే చెప్పాలి . లేదంటే మహర్షి బాహుబలి సినిమాల తర్వాతి ప్లేస్ లో ఉండేది .

Show Full Article
Print Article
Next Story
More Stories