బడ్జెట్ ప్రవేశపెట్టే వేళ కుమార స్వామి సర్కారుకు టెన్షన్

బడ్జెట్ ప్రవేశపెట్టే వేళ కుమార స్వామి సర్కారుకు టెన్షన్
x
Highlights

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. బడ్జెట్ సమావేశాల వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు సీఎం కుమార స్వామికి , కర్ణాటక కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా...

కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. బడ్జెట్ సమావేశాల వేళ కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరు సీఎం కుమార స్వామికి , కర్ణాటక కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారింది. రెండ్రోజుల కింత్రం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలకు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డుమ్మాకొడుతుండడం బీజేపీకి ఆయుధంగా మారింది. ఎమ్మెల్యేల గైర్హాజరీతో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మైనార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌ను అడ్డుకుంటామని శపథం చేస్తున్నారు. దీంతో ఇవాళ బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోననే ఉత్కంఠనెలకొంది.

అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెలు హాజరుకాకపోవడంపై ఆగ్రహించిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. బడ్జెట్ సమావేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు కావాలని ఆదేశించింది. అటు సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిందంటున్న బీజేపీ నేతలు ఈ అంశంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories