ఏపీ కాంగ్రెస్‌కు మరో షాక్‌

ఏపీ కాంగ్రెస్‌కు మరో షాక్‌
x
Highlights

విభజనతో ఏపీలో కుదేలయిన కాంగ్రెస్‌కు కష్టాలు ఇప్పుడిప్పుడే తీరేలా కనిపించడం లేదు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నేతలు కూడా పక్క పార్టీల వైపు...

విభజనతో ఏపీలో కుదేలయిన కాంగ్రెస్‌కు కష్టాలు ఇప్పుడిప్పుడే తీరేలా కనిపించడం లేదు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్ నేతలు కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. తాజాగా ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కోట్ల కుటుంబం పార్టీ మారాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా కేంద్ర మాజీ మంత్రిగా ఉన్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం లేదా రాత్రికి సీఎం చంద్రబాబుతో ఆయన కుటుంబ సమేతంగా భేటి కానున్నారు. కేంద్ర నాయకత్వమే రంగంలోకి దిగి కోట్ల పార్టీని వీడకుండా బుజ్జగించినా ఫలితం దక్కలేదు. ఇదే సమయంలో కోట్లకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేస్తున్నారు .

Show Full Article
Print Article
Next Story
More Stories