కన్నయ్య కుమార్‌పై 1200 పేజీల ఛార్జ్‌షీట్‌

Kanhaiya Kumar
x
Kanhaiya Kumar
Highlights

ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌పై ఛార్జ్‌షీట్‌ నమోదైంది. దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు 1200 పేజీలతో కూడిన అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు.

ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌పై ఛార్జ్‌షీట్‌ నమోదైంది. దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు 1200 పేజీలతో కూడిన అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. కన్నయ్య కుమార్‌తో పాటు మరో ఇద్దరు విద్యార్థి సంఘం నాయకుల పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చారు.

పార్లమెంటుపై దాడి సూత్రధారి అఫ్జల్ గురుకు ఉరి శిక్ష అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ 2016 ఫిబ్రవరి 9న ఢిల్లీలోని జేఎన్‌యూ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో నాటి విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌, ఉమర్ ఖలీద్, భట్టాచార్యలు తదితరులు భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. దేశ ద్రోహం కేసులో కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్, భట్టాచార్యలను 2016లో అరెస్టు చేశారు.

ఈ కేసులో కన్నయ్య కుమార్‌, ఉమర్ ఖలీద్, భట్టాచార్యలపై దేశద్రోహం క్రిమినల్‌ కుట్ర, అలర్లకు ప్రేరేపణ, అనుమతి లేకుండా సమావేశం కావడం వంటి సెక్షన్లపై ఢిల్లీ పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. మొత్తం 1200 పేజీలతో అభియోగ పత్రం రూపొందించి పాటియాలా హౌజ్ కోర్టులో సమర్పించారు. పోలీసుల ఛార్జ్‌షీట్‌పై కన్నయ్య కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తనపై బీజేపీ ప్రభుత్వం కక్ష సాధిస్తుందని ఆరోపించారు. దేశ న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు.

పార్లమెంట్ ఎన్నికల ముందు మోడీ ప్రభుత్వానికి పాత కేసులు గుర్తుకు వస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. రాజకీయ దురుద్దేశంతోనే కన్నయ్యపై చార్జీషీట్ దాఖలు చేశారని చెప్పారు. కన్నయ్య లాంటి ఉద్యమకారులను ఎన్నికల్లో పోటీ చేయకుండా మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ఢిల్లీ జేఎన్ యూలో ఘటన జరిగిన మూడేళ్ల తరువాత కన్నయ్య, మరో ఇద్దరిపై అభియోగాలు దాఖలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories