అవసరమైతే ట్రంప్‌ సహాయం తీసుకుంటా.. కేఏ పాల్‌

అవసరమైతే ట్రంప్‌ సహాయం తీసుకుంటా.. కేఏ పాల్‌
x
Highlights

శ్రీకాకుళం మత్స్యకారుల కోసం పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌తోనైనా మాట్లాడతానని కేఏపాల్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పడు తాను స్వయంగా ఫోన్ చేసి శుభా‍కాంక్షలు తెలిపానని అన్నారు. అతి త్వరలోనే శ్రీకాకుళం మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తానన్నారు.

శ్రీకాకుళం మత్స్యకారుల కోసం పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌తోనైనా మాట్లాడతానని కేఏపాల్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పడు తాను స్వయంగా ఫోన్ చేసి శుభా‍కాంక్షలు తెలిపానని అన్నారు. అతి త్వరలోనే శ్రీకాకుళం మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తానన్నారు. 22మంది మత్స్యకారుల విడుదలకు తాను ఎంతైనా కృషి చేస్తానని ఇంకా అవసరమైతే అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ సహాయం కోరుతానని అన్నారు. నేడు విశాఖపట్టణంలో ప్రజాశాంతి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ ఏపీలో టీడీపీ పని అయిపోతుందని, గతంలో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ కనుమరుగువుతుందని చెప్పానని అన్నారు. మాతో ఎవరు కలిసి వచ్చినా వారితో మేము తప్పకుండా పనిచేస్తామన్నారు. మహబూబ్ నగర్, ఒంగోలులో నాపై ఉన్న కేసులు మాఫీ చేస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. కాని ఇప్పడు మాఫీ కాకుండ చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కావలనే భీమవరంలో నా సభను చంద్రబాబు అడ్డుకున్నరని ధ్వజమెత్తారు. గతంలో ఇచ్చిన హామీలను ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు అమలు చేశాడా అని ప్రశ్నించాడు. ఏం అడిగినా మోడీ ఇవ్వలేదని కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories