అప్పుడు అన్న..ఇప్పుడు తమ్ముడు

అప్పుడు అన్న..ఇప్పుడు తమ్ముడు
x
Highlights

టీడీపీ ఓటమికి జనసేన కారణమా..?. తాజా ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఫ్యాన్ హోరుతో టీడీపీ ఓటమి పాలుకాగా మరీ తక్కువ సీట్లు రావడానికి జనసేనే కారణమనే వాదన...

టీడీపీ ఓటమికి జనసేన కారణమా..?. తాజా ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఫ్యాన్ హోరుతో టీడీపీ ఓటమి పాలుకాగా మరీ తక్కువ సీట్లు రావడానికి జనసేనే కారణమనే వాదన వినిపిస్తోంది. వైసీపీ గెలుపొందిన అభ్యర్దులకు వచ్చిన మెజార్టీ కంటే కొన్ని చోట్ల జనసేనకు వచ్చిన ఓట్లే అధికంగా ఉన్నాయి. ఏపీలో 31 నియోజకవర్గాల్లో టీడీపీ విజయాన్ని దెబ్బతీసింది.

ఏపీలో టీడీపీ ఓటమిపై జనసేన ప్రభావం బాగా పడింది ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ అభ్యర్ధులు సాధించిన ఓట్లను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. వైసీపీ విజయం సాధించిన 32 చోట్ల జనసేన గణనీయమైన ఓట్లు సాధించింది. ఎనిమిది లోక్ సభ 32 శాసనసభా నియోజకవర్గాల్లో జనసేన ప్రభావం ఎక్కువగా కనిపించింది. వైసీపీ అభ్యర్ధులు సాధించిన మెజార్టీ కన్నా జనసేన అభ్యర్ధులకు వచ్చిన ఓట్లే అధికంగా ఉన్నాయి.

శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన సాధించిన ఓట్లు టీడీపీ విజయావకాశాలను దెబ్బతీశాయి.

యలమంచిలిలో టీడీపీ కంటే వైసీపీకి నాలుగు వేల ఓట్లు అధికంగా రాగా జనసేనాకు 16,500 ఓట్లు వచ్చాయి. రామచంద్రాపురంలో వైసీపీకి 5 వేల ఓట్ల మెజార్టీ దక్కకగా జనసేనకు 17,592 ఓట్లు వచ్చాయి. తణుకులో వైసీపీ 1264 ఓట్లతో గెలిచింది ఇక్కడ జనసేనకు 35,502 ఓట్లు పడ్డాయి. విజయవాడ వెస్ట్‌లో వైసీపీ 6వేల ఓట్ల తేడాతో గెలిస్తే జనసేనకు 22,312 ఓట్లు వచ్చాయి. నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ 1587 ఓట్లతో ఓడిపోగా జనసేనకు 4104 ఓట్లు పడ్డాయి. తిరుపతిలో వైసీపీ 708 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచింది. ఇక్కడ జనసేన అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తికి 12వేలకు పైగా ఓట్లు వచ్చాయి.

బాపట్ల నియోజకవర్గంలో జనసేన మద్దతుతో బీఎస్పీ అభ్యర్థి రంగంలో నిలిచారు. ఇక్కడ వైకాపా అభ్యర్థికి 15881 ఓట్ల మెజారిటీ రాగా బీఎస్పీ అభ్యర్థికి 41,816 ఓట్లు లభించడం గమనార్హం. జనసేన అభ్యర్థుల్లో అత్యధిక ఓట్లు విశాఖ లోక్‌సభ అభ్యర్థి సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ సాధించారు. ఆ తర్వాత అమలాపురం అభ్యర్థి డీఎంఆర్‌ శేఖర్‌, నర్సాపురం అభ్యర్ధి సినీ నటుడు నాగబాబుకు వచ్చాయి. 2009లోనూ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి టీడీపీని ఇదే విధంగా దెబ్బతీస్తే ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ప్రభావం చూపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories