Top
logo

ట్రెండింగ్‌: వెల్‌కమ్‌ బ్యాక్‌ అభినందన్‌

ట్రెండింగ్‌: వెల్‌కమ్‌ బ్యాక్‌ అభినందన్‌
X
Highlights

భారత్‌ ఒత్తిడికి పాకిస్థాన్ తలొగ్గింది. ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు మద్దతుగా నిలవడటంతో ఇక ఒంటరిగా మిగలడం తప్పదని ...

భారత్‌ ఒత్తిడికి పాకిస్థాన్ తలొగ్గింది. ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు మద్దతుగా నిలవడటంతో ఇక ఒంటరిగా మిగలడం తప్పదని భావించిన పాక్ చేసేదేమీ లేక భారత పైలట్ అభినందన్‌ను విడుదల చేయడానికి అంగీకరించింది. శాంతిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇండియన్ పైలట్‌ను విడుదల చేయాలని నిర్ణయించామని పాకిస్తాన్ పార్లమెంట్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించారు. స్పష్టం చేశారు. అభినందన్‌ విడుదలపై పాక్ ప్రకటించగానే భారత్‌లో హార్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అభినందన్‌ విడుదల కానుండటంతో దేశ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో సైతం అభినందన్‌ వెల్‌కమ్‌ బ్యాక్‌ అభినందన్‌ (#welcome back Abhinandan)అనే హ్యాష్‌ ట్యాగ్‌ తెగ ట్రెండ్‌ అవుతోంది. ప్రతి ఒక్కరు తమ వాట్సాప్ లలో స్టాటస్ లు పెట్టుకుంటున్నారు. ఇక సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు వింగ్‌ కమాండర్‌ విడుదలపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పైలట్ అభినందన్ విజేతగా తిరిగి వస్తుండటంతో యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది.

Next Story