కొత్త సంవత్సరంలో భారత్ మరో కొత్త రికార్డు

New Year 2019
x
New Year 2019
Highlights

కొత్త సంవత్సరంలో భారత్ మరో రికార్డు క్రియేట్ చేసింది అగ్ర దేశాలను వెనక్కి నెడుతూ మొదటి ప్లేస్‌ను ఆక్రమించింది.

కొత్త సంవత్సరంలో భారత్ మరో రికార్డు క్రియేట్ చేసింది అగ్ర దేశాలను వెనక్కి నెడుతూ మొదటి ప్లేస్‌ను ఆక్రమించింది. మనకి దరి దాపుల్లో మరో దేశం లేదంటే అతిసయోక్తి కాదు ఇంతకీ ఈ రికార్డు దేనిలో అనే కదా మీ డౌట్ అది తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

పుట్టినరోజు అందరికీపండగే అలాంటిది ప్రత్యేక మైన రోజున పుడితే మరింత స్పెషల్ పుట్టిన రోజుకీ పైన చెప్పిన దానికి సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా ఆవిషయానికే వస్తున్నాం కొత్త సంవత్సరం మొదటి రోజు భారత్ ఓ రికార్డు క్రియేట్ చేసింది. 2019 న్యూ ఇయర్ ఒక్క రోజున మన దేశంలో ఎక్కువ మంది పిల్లలు పుట్టినట్లు ఐక్యరాజ్య సమితి చిల్డ్రెన్ ఎమర్జెన్సీ ఫండ్ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల 95 వేల మంది శిశువులు డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 దాటిన తర్వాత పుట్టినట్లు UNICEF అంచనా వేసింది వాళ్లలో 18శాతం మంది ఒక్క ఇండియాలోనే జన్మించారు. ఇండియాలో దాదాపు 69 వేల 944 మంది శిశువులు జన్మించారు. పిల్లల విషయంలో భారత్ దే ఫస్ట్ ప్లేస్. మన తర్వాతి స్థానంలో చైనా నిలిచింది. అక్కడ జనవరి 1న 44వేల 940 మంది జన్మించారు. మూడోస్థానంలో నైజీరియా ఉంది. అక్కడ మోన్న 25, 684 మంది పుట్టారు. ఇక 15,112 మందితో పాకిస్థాన్ నాలుగోస్థానంలో ఉండగా ఇండొనేసియా 13,256 మందితో ఐదో పొజిషన్‌లో ఉంది.

కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత పుట్టిన బిడ్డల ఆధారంలో ఈ లెక్కలు వేసినట్లు ఆయా దేశాల హెల్త్ ఆర్గనైజేషన్స్ తెలిపాయని UNICEF వెల్లడించింది. జనవరి 1 మొత్తం 24 గంటల సమయాన్ని లెక్కలోకి తీసుకుంటే మొదటగా పసిఫిక్ లోని ఫిజిలో జన్మించగా అమెరికాలో చివరిబిడ్డ పుట్టినట్లు రిపోర్టులు వచ్చాయని తెలిపింది. మన దేశంలో 12:20 సమయంలో ఢిల్లీలో మొదటి శిశువు పుట్టింది. మొత్తానికి భారత్ కొత్త సంవత్సరాన్ని కొత్త రికార్డుతో ప్రారంభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories