తండ్రి సహకారం అందించిన చిత్రంలో మాదిరిగానే..

తండ్రి సహకారం అందించిన చిత్రంలో మాదిరిగానే..
x
Highlights

చెలియా సినిమా గుర్తుందా.? కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళానికి చెందిన విమానాన్ని పాక్ సేనలు కూల్చివేస్తారు. పైలెట్ హీరో కార్తీ విమానం నుంచి ఎజెక్ట్...

చెలియా సినిమా గుర్తుందా.? కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళానికి చెందిన విమానాన్ని పాక్ సేనలు కూల్చివేస్తారు. పైలెట్ హీరో కార్తీ విమానం నుంచి ఎజెక్ట్ అయి కింద పడిపోతాడు. పాక్ ఆర్మీ అతన్ని యుద్ధఖైదీగా పట్టుకుంటుంది. సినిమా కథ ఇది అయితే ఇందులో మరోకోణం ఉంది.

ఈ చిత్రానికి దర్శకుడిగా మణిరత్నం వ్యవహరించాడు. సినిమా కోసం మణిరత్నం భారత వైమానిక దళం గురించి తెలుసుకోవడానికి సింహకుట్టి వర్ధమాన్‌ను సంప్రదించాడు. సినిమా విడుదలకు ముందు జరిగిన కార్యక్రమంలో సంహకుట్టి వర్ధమాన్ పాల్గొన్నాడు. భారత వైమానిక దళ కథలు వెడితెరపై ఎప్పడూ ఆవిష్కృతం కాలేదని చెప్పారు. ఈ ప్రాజెక్టు గురించి విన్నప్పుడు నా సహాయం అందించాలనుకున్నానని తెలిపారు. మణిరత్నం సినిమాకు పని చేస్తానని కలలో కూడా అనుకోలేదని అన్నారు. ఇప్పుడా సినిమాలోని తొలి దృశ్యమే నిజ జీవితంలోనూ జరిగింది. పాక్ సైన్యానికి చిక్కిన భారత పైలెట్ అభినందన్ సింహకుట్టి వర్దమాన్ కుమారుడే.





Show Full Article
Print Article
Next Story
More Stories