ఆ గ్రామంలో వానర సైన్యం...కోతుల బెడద బాధితుల సంఘం ఏర్పాటు

ఆ గ్రామంలో వానర సైన్యం...కోతుల బెడద బాధితుల సంఘం ఏర్పాటు
x
Highlights

తెల్లారిందంటే ఆ గ్రామస్తులకు వణుకు మొదలవుతుంది. రాత్రి అవుతుందంటే గుండెల్లో దడ పెడుతుంది. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలన్నా భయమే. కర్రలు పట్టుకుని...

తెల్లారిందంటే ఆ గ్రామస్తులకు వణుకు మొదలవుతుంది. రాత్రి అవుతుందంటే గుండెల్లో దడ పెడుతుంది. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలన్నా భయమే. కర్రలు పట్టుకుని గుంపులు గుంపులుగా తిరుగుతారు. తమ పొలాల రక్షణకు వేలల్లో ఖర్చు చేస్తున్నారు. ఇంతకీ ఆ గ్రామస్ధులను వెంటాడుతున్న ఆ భయం ఏంటి? బయటకు వెళ్లేందుకు కర్రల సాయం ఎందుకు? కుక్కలను ఎందుకు కాపలా పెట్టుకుంటున్నారో తెలుసుకోవాలంటే నిజామాబాద్ జిల్లాలోని ఓ పల్లెకు వెళ్లాల్సిందే.

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం గుమ్మిర్యాల గ్రామం. నిజామాబాద్-నిర్మల్-జగిత్యాల జిల్లాల సరిహద్దు పల్లె. ఐదేళ్లుగా ఆ గ్రామాన్ని వానరా మూకలు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. మందలు మందలుగా ఊరి మీద పడి ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి. ఆహారం కోసం పంట చేళ్లను ధ్వంసం చేస్తూ రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. వేరుశనగ సాగుకు ప్రసిద్ది చెందిన ఆ గ్రామంలో కోతుల బెడదతో ఇప్పుడు ఆ పంటను పండించడమే మానేశారు. కొందరు కోతులు ముట్టని ఆవ పంట వైపు మళ్లగా మరికొందరు గత్యంతరం లేక మొక్కజొన్న, పసుపు పంటలను సాగు చేస్తున్నారు. అయితే పంటలపై కోతులు దాడి చేయకుండా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ గ్రామస్ధులు. ఒక్కొక్క రైతు పొలం కాపలాకు 30వేల వరకు వెచ్చిస్తున్నారు. అంతేకాదు కోతుల బెడద బాధితుల సంఘం ఏర్పాటు చేసి పోరాటం చేస్తున్నారు.

ఇంటికో చెట్టు వేరుశనగ సాగుతో తెలంగాణలోనే ప్రసిద్ది చెందిన గుమ్మిర్యాల గ్రామంలో కోతుల బెడద కారణంగా ఉన్న చెట్లను కొట్టేస్తున్నారు. దాడి చేస్తున్నాయని ఇంటికో కుక్కను రక్షణ కోసం పెంచుకుంటున్నారు. ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే కర్రలను చేతపట్టుకుని వెళ్లాల్సిందే. ఇంటికొకరు కోతుల దాడి బాధితులు ఉన్నారంటే పరిస్దితి ఎంత తీవ్రంగా ఉందో అర్దం చేసుకోవచ్చు.

గుమ్మిర్యాల గ్రామస్ధులకు తెల్లారిందంటే వణుకు పుడుతుంది. సాయంత్రం అయ్యిందంటే కంటిమీద కునుకు కరువవుతుంది. ఒంటరిగా ఇంటి బయట అడుగు పెట్టాలంటే ఏవైపు నుంచి వచ్చి కోతులు దాడి చేస్తాయో తెలియక భయంతో వణికిపోతున్నారు. కోతులతో తాము పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను వేడుకుంటున్నారు గుమ్మిర్యాల గ్రామస్ధులు.


Show Full Article
Print Article
Next Story
More Stories