విశాఖ రాజకీయాల్లో మరో ప్రస్థానం...

విశాఖ రాజకీయాల్లో మరో ప్రస్థానం...
x
Highlights

విశాఖ రాజకీయాల్లో వాళ్లిద్దరు చక్రం తిప్పిన నేతలు రాజకీయ ప్రత్యర్ధులుగా సుదీర్గ కాలం కొనసాగిన ఉద్దండులు అయితే గత కొంతకాలంగా క్రీయాశీలక రాజకీయాలకు...

విశాఖ రాజకీయాల్లో వాళ్లిద్దరు చక్రం తిప్పిన నేతలు రాజకీయ ప్రత్యర్ధులుగా సుదీర్గ కాలం కొనసాగిన ఉద్దండులు అయితే గత కొంతకాలంగా క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా వుంటునే కొత్త దారులు వెతుక్కున్నారు. అనేక ఊహాగానాల మధ్య చెరోదారిలోకి పయనిస్తున్నారు. వాళ్లు మరెవరో కాదు టీడీపీ, కాంగ్రెస్ లలో తిరుగులేని నేతలగా మెలిగిన దాడి వీరభద్రరావు, కొణతాల రామక్రిష్ణ అయితే ఇప్పుడు దాడి ఫ్యాను వైపు మొగ్గు చూపితే, కొణతాల సైకిల్ ఎక్కేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

విశాఖ రాజకీయాల్లో ప్రధాన నేతలుగా చక్రం తిప్పిన దాడి వీరభద్రరావు, కొణతాల రామక్రిష్ణలు గత ఎన్నికల నుండి సైలెంట్ గా వుండిపోయారు. దీంతో వీరిద్దరిని ఫెయిడ్ ఔట్ లీడర్స్ గా విశాఖ చరిత్రలో మిగిలిపోతారని అనుకున్నారు. అయితే తమ చరిష్మా పై నమ్మకం వున్న ఈ ఇద్దరు తమ తమ రాజకీయ అనుభవాలను రంగరిస్తూ మళ్లీ మలివిడత ప్రస్థానంకు పునాదులు వేసుకున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గం నుండి దశాబ్దాల కాలంగా వీరిద్దరు రాజకీయ ప్రత్యర్ధులుగా కొనసాగారు. అయితే ఇద్దరూ ఒకేసారి రాజకీయాల నుండి దూరం అవ్వడం మళ్లీ ఇద్దరు ఒకేసారి రీ ఎంట్రీ ఇవ్వడం కూడా అరుదనే చెప్పాలి. దాడీ వీరభద్రరావు ఎన్టీఆర్ హాయంలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తూ మంత్రిగా, శాసన సభ్యులుగా, శాసన మండలి సలహాదారుగా, పోలిట్ బ్యూరో సభ్యులుగా అనేక పదువులు పొందడంతో పాటు పార్టీ ప్రధాన సలహాదారుగా కూడా టీడీపీ లో వ్యవహరించారు. తరువాత టిక్కెట్ల విషయంలో వచ్చిన విభేదాలతో పార్టీకి దూరం అయ్యారు. అయితే పాత పరిచయాలు, పార్టీ అందించిన సేవలను చూపుకుని దాడి వీరభద్రరావు టీడీపీ కి వెళుతున్నారని ప్రచారం జరిగింది. తరువాత పవన్ కళ్యాణ్ దాడి ఇంటికి సైతం వెళ్లి చర్చలు జరపడంతో జనసేన లో చేరుతారనే ప్రచారం జరిగింది. దాడి మాత్రం వ్యూహ,ప్రతివ్యూహాలు చేస్తూ చివరకు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరో రెండు రోజుల్లో జగన్ సమక్షంలో వైసీపీ లో చేరనున్నారు.

మరోవైపు కొణతాల రామక్రిష్ణ కూడా వైఎస్ఆర్ హాయాం నుండి కాంగ్రెస్‌లో క్రీయశీలక నేతగా వ్యవహరించారు. మంత్రిగా, పార్లమెంట్ సభ్యులుగా సేవలు అందించారు. అంతే కాదు ఉత్తరాంధ్రా లోనే ఏకైక కాంగ్రెస్ మంత్రిగా కొనసాగారు. దీంతో కొణతాల కు కాంగ్రెస్‌లో మంచి పట్టు వుండేది. అనుకోకుండా వైఎస్ఆర్ మరణాతరం పుట్టిన వైసీపీ లోనికి కొణతాల వెళ్లిన కొన్ని విభేదాలతో పార్టీకి దూరంగా వుంటూ వచ్చారు. ఈ నేపద్యంలో తనదైన ముద్ర చాటుకునేందుకు కొన్ని స్వచ్చంద సంస్థలు, ఉత్తరాంధ్రా చర్చా వేదిక ద్వారా స్థానిక సమస్యలపై గళం వినిపిస్తూ వచ్చారు. దీంతో కొణతాలకు ఫాలోయింగ్ పెరిగింది. ప్రధాన పార్టీలు నుండి ఆహ్వానం అందింది. ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకున్నా దాడి వైసీపీలోనికి ఎంట్రీ ఇచ్చేయడంతో కొణతాలకు మిగిలినదారి కేవలం టీడీపీ మాత్రమే దీంతో కొణతాల కూడా సైకిల్ ఎక్కేందుకు ముహుర్తం సిద్దం చేసుకుంటున్నారు.

ఈ ఇద్దరు నేతల సెకండ్ ఇన్నింగ్స్ పార్టీలలో కొత్త ఉత్సహాన్ని నింపడంతో పాటు హాట్ టాపిక్ చర్చలకు వేదిక అవుతుంది. అంతే కాదు విశాఖ రాజకీయాల్లో మరో ప్రస్థానం ప్రారంభం కాబోతుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories