ప్రతిభకు పట్టం కట్టే ఓ అపురూప సందర్భం

ప్రతిభకు పట్టం కట్టే ఓ అపురూప సందర్భం
x
Highlights

వాణిజ్య రంగంలో అద్భుత విజయాలు సాధించే సంస్థలు, వ్యక్తులకు ఏటేటా బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డులిచ్చి ప్రోత్సహించే హెచ్ఎంటివీ ఈ ఏడాది కూడా ఆ...

వాణిజ్య రంగంలో అద్భుత విజయాలు సాధించే సంస్థలు, వ్యక్తులకు ఏటేటా బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డులిచ్చి ప్రోత్సహించే హెచ్ఎంటివీ ఈ ఏడాది కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నవ్యాంధ్ర వేదికగా ఈ సారి బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డుల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

నిజాయితీకి, నిబద్ధతకు, నిష్పాక్షితకు మారుపేరైన HMTV వాణిజ్య, వ్యాపార రంగాల్లో ప్రతిభను కనబరిచే వ్యక్తులు, సంస్థలకు పురస్కారాలిచ్చి వారిని ప్రోత్సహించడం ఆనవాయితీగా పెట్టుకుంది. గత మూడేళ్లుగా క్రమం తప్పకుండా బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డుల ప్రదానాన్ని నిర్వహిస్తున్న సంస్థ ఈసారి నవ్యాంధ్ర లో విజయ వాడ వేదికగా కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తోంది. విజయవాడ క్లబ్ లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్, గౌరవ అతిధిగా ఐటీ మంత్రి నారాలోకేష్ హాజరవుతున్నారు.

వాణిజ్య రంగంలో పట్టుదలతో విజయాలు సాధిస్తున్న వ్యక్తులు, సంస్థలను ప్రతిష్టాత్మక జ్యూరీ సభ్యుల ఆధ్వర్యంలో ఎంపిక చేశారు. అగ్రీ, ఫుడ్ ప్రోససింగ్, హెల్త్ కేర్, మాన్యుఫాక్చరింగ్,ఐటి, ఫార్మా, ఇలా అనేక రంగాలలో అత్యద్భుతమైన ప్రగతి కనబరచిన వారికి ఈ సత్కారం జరగబోతోంది. దాదాపు పాతికమందికి పైగా విజేతలు అవార్డులనందు కోబోతున్నారు సన్ రైజ్ స్టేట్ ఆంధ్ర ప్రదేశ్ లో కంపెనీలకు పెట్టుబడులు పెట్టడానికి పుష్కలమైన వనరులు, అవకాశాలు ఉన్నాయి. HMTV చేపడుతున్న బిజినెస్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఎందరో ప్రతిభావంతులు, ఔత్సాహిక వాణిజ్య వేత్తలకు స్ఫూర్తినిస్తుందని, ఏపీలోనూ తమ వ్యాపారావకాశాలు విస్తరించుకునేలా ప్రేరేపిస్తుందని హెచ్ ఎంటీవీ నమ్ముతోంది. అవార్డులు సాధించిన ప్రముఖుల స్ఫూర్తితో మరింతమంది వ్యాపార రంగంలోకి రావాలని, కొత్త కంపెనీలు పెట్టాలనీ, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనించాలని కోరుకుందాం.

Show Full Article
Print Article
Next Story
More Stories