భారీగా పెరిగిన సర్వీస్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు

భారీగా పెరిగిన సర్వీస్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు
x
Highlights

నరాలు తెగే ఉత్కంఠకు మరికొద్ది గంట్లో తెరపడనుంది. హోరాహోరీగా పోరాడిన అభ్యర్థుల భవితవ్యంపై ఓటర్లు ఇచ్చిన తీర్పు గురువారం వెలువడనుంది. అయితే ఈసారి ఏపీలో...

నరాలు తెగే ఉత్కంఠకు మరికొద్ది గంట్లో తెరపడనుంది. హోరాహోరీగా పోరాడిన అభ్యర్థుల భవితవ్యంపై ఓటర్లు ఇచ్చిన తీర్పు గురువారం వెలువడనుంది. అయితే ఈసారి ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సర్వీస్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు భారీగా పెరిగాయి.

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా సర్వీస్‌, పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు భారీగా పోలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోస్టల్‌ బ్యాలెట్లతో పోలిస్తే, సర్వీస్‌ ఓట్లు బాగా పెరిగాయి. గురువారం ఉదయం ఏడు గంటల లోపు కౌంటింగ్ సెంటర్‌కు చేరే సర్వీస్‌ ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయని అధికారులు తెలిపారు. ఈసారి పెరిగిన సర్వీస్‌, పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు ఎవరికి అనుకూలంగా మారతాయన్నదానిపై నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

కౌటింగ్‌ కు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు పోలైన సర్వీస్‌ ఓట్ల వివరాలను ఎన్నికల అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలో 8వేల 121, విజయనగరం జిల్లాలో 2వేల 564, విశాఖపట్నం జిల్లాలో 3వేల 333 సర్వీస్ ఓట్లు పోలయ్యాయి. తూర్పు గోదావరిలో 923, కృష్ణా జిల్లాలో 457, గుంటూరు జిల్లాలో 3వేల 36 సర్వీస్ ఓట్లు పోలవ్వగా ప్రకాశం జిల్లాలో 3వేల 765, నెల్లూరు జిల్లాలో 362 సర్వీసు ఓట్లు పోలయ్యాయి. కడప జిల్లాలో 11వందల 75, కర్నూలు జిల్లాలో 19వందల 35 ఓట్లు, అనంతపురం జిల్లాలో 16వందల 76, చిత్తూరు జిల్లాలో 2వేల 185 సర్వీసు ఓట్లు పోలైనట్టు అధికారులు తెలిపారు.

ఏపీలోని 25 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో 28లక్షల 62వేల 175 పోలైన సర్వీస్‌ ఓట్లు

అసెంబ్లీలకు పోలైన మొత్తం సర్వీస్ ఓట్లు 29,53225.

పార్లమెంటు నియోజక వర్గాల్లో వచ్చిన ఫారం 12 దరఖాస్తులు 3,17,291

లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలో జారీ చేసిన ఓట్లు 3,00,957

ఇప్పటి వరకు లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలో ఆర్వోలకు అందిన పోస్టల్‌ బ్యాలెట్లు 2,14,937

13 జిల్లాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నది 3,18,530

మంజూరు చేసింది 3,05,040

మే 20 నాటికి ఆర్వోలకు చేరిన పోస్టల్ బ్యాలెట్లు 2,11,623

Show Full Article
Print Article
Next Story
More Stories