పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

Telangana High Court
x
Telangana High Court
Highlights

తెలంగాణలో పంచాయితీ ఎన్నికల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్‌ను 34 నుంచి 22 శాతానికి తగ్గిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్ ను కొట్టివేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

తెలంగాణలో పంచాయితీ ఎన్నికల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్‌ను 34 నుంచి 22 శాతానికి తగ్గిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్ ను కొట్టివేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసినందున ఎన్నికల నిలిపివేతకు ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో ఈ విషయంలో పిటిషన్ దాఖలు చేసిన బీసీ జాతీయ సంఘం నేత ఆర్.కృష్ణయ్యకు చుక్కెదురైంది.

రిజర్వేషన్ తగ్గింపు వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరగుతుందని కృష్ణయ్య తరఫు న్యాయవాది వాదించారు. ఆర్డినెన్స్ ను వెంటనే రద్దు చేయాలని కోరారు. పిటిషనర్‌ వాదనలు విన్న ధర్మాసనం ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories