ఆకట్టుకుంటున్న "మల్లేశం" ట్రైలర్

ఆకట్టుకుంటున్న మల్లేశం ట్రైలర్
x
Highlights

ప్రతి చేనేత కార్మికుడికి గుర్తుండే వ్యక్తి చింతకింది మల్లేశం. ఇప్పుడు ఆయన పై సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే . ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి...

ప్రతి చేనేత కార్మికుడికి గుర్తుండే వ్యక్తి చింతకింది మల్లేశం. ఇప్పుడు ఆయన పై సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే . ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ సినిమా థ్రియేట్రికల్ ట్రైలర్ నిన్న విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన వస్తుంది .. తెలంగాణా యాస , సంస్కృతి ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చాలా చక్కగా ప్రజెంట్ చేసాడు దర్శకుడు రాజ్ ఆర్... ఈ సినిమాను డైరెక్టర్ రాజ్ ఆర్‌, శ్రీ అధికారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియదర్శికి జోడిగా అనన్య నటిస్తుంది . ప్రియదర్శి తల్లిగా ఝాన్సీ నటిస్తోంది.

ఒక చీరకు ఆసు పోయడానికి దారాన్ని పిన్నుల చుట్టు 9వేల సార్లు అటూ ఇటూ తిప్పాలి. ఇలా రోజుకి 18వేల సార్లు దారాన్ని కండెల చుట్టూ తిప్పితే గాని రెండు చీరలు తయారుకావు. దారాన్ని కండెల చుట్టూ తిప్పుతుంటే మల్లేషం తల్లి చేతులు లాగుతూ ఉండేవి. అమ్మ భుజం నొప్పితో రోజంతా బాధపడుతుంటే అమ్మ కష్టం గట్టేక్కేదెలా ఏదో ఒకటిచేయాలనుకున్నాడు. అందులో భాగంగా ఆసు యంత్రం తయారు చేయాలనే ఆలోచన పుట్టింది .. ఇవే అంశాలను దర్శకుడు ట్రైలర్ లో చాలా చక్కగా చూపించాడు .. సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ..

Show Full Article
Print Article
Next Story
More Stories