ఏపీ రైతులకు గుడ్ న్యూస్

ఏపీ రైతులకు గుడ్ న్యూస్
x
Highlights

ఏపీ కేబినెట్‌ రైతులు, డ్వాక్రా మహిళలపై వరాల జల్లు కురిపించింది. రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింప జేయాలని మంత్రి...

ఏపీ కేబినెట్‌ రైతులు, డ్వాక్రా మహిళలపై వరాల జల్లు కురిపించింది. రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింప జేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ప్రతి రైతు కుటుంబానికి 10 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో కేంద్రం అందిస్తున్న 6 వేల ఆర్ధిక సాయం కూడా ఉందని వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కేంద్రం పథకం వర్తించని వారికి కూడా 10 వేల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తామని ఆయన తెలిపారు. ఖరీఫ్‌‌, రబీ సీజన్‌లకు వేర్వేరుగా రెండు విడతల్లో ఐదు వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ పథకం అమలుచేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 7 వేల 621 కోట్ల రూపాయల భారం పడనుంది.

అన్నదాత సుఖీభవలో భాగంగా ప్రతి రైతుకు 10 వేల రూపాయల మేర ఆర్ధిక సాయం అందనుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 76.21 లక్షల కమతాలు ఉన్నాయి. ఇందులో 5 ఎకరాలలోపు కమతాలు కలిగిన రైతులు 60 లక్షల మంది ఉన్నారు. తక్షణమే చెక్కులు సిద్ధం చేయాలని ఆదేశించిన ప్రభుత్వం ఈ నెల చివరి నాటికి రైతులకు అందించనుంది. ఇదే సమయంలో రుణమాఫీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను రెండు విడతల్లో చెక్కుల ద్వారా చెల్లించాలని నిర్ణయించింది.

ఇక డ్వాక్రా మహిళలపై కూడా కేబినెట్ వరాల జల్లు కురిపించింది. ఇప్పటికే పసుపు కుంకుమ కార్యక్రమంతో 10 వేల రూపాయలు అందించిన ప్రభుత్వం తాజాగా డ్వాక్రా మహిళలందరికీ స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఫోన్లతో పాటు సిమ్‌ కార్డులు కూడా ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు మూడు సంవత్సరాలు ఇన్‌ కమింగ్ ‌, అవుట్ గోయింగ్ సౌకర్యం ఉండేలా ఫోన్లను అందించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories