Top
logo

గోల్డ్ షాప్ గోడకు కన్నం.. విజయవాడలో భారీ చోరీ

గోల్డ్ షాప్ గోడకు కన్నం.. విజయవాడలో భారీ చోరీ
Highlights

విజయవాడలో భారీ చోరీ జరిగింది. ఓ జ్యూవెలరీ షాపు గోడకు కన్నం వేసిన దొంగలు భారీ ఎత్తున్న బంగారం దోచుకెళ్లారు....

విజయవాడలో భారీ చోరీ జరిగింది. ఓ జ్యూవెలరీ షాపు గోడకు కన్నం వేసిన దొంగలు భారీ ఎత్తున్న బంగారం దోచుకెళ్లారు. పటమట దుర్గామహల్‌ దర్గర సాయికిరణ్‌ బంగారం షాప్‌లో ఈ చోరీ జరిగింది. గోల్డ్‌ షాపు గోడకు కన్నం పెట్టి మరీ దొంగలు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్‌ టీమ్‌ ఆధారాలను సేకరిస్తున్నారు. మొత్తం 400 గ్రామలు బంగారం చోరీకి గురైనట్టు పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజ్‌ని పరిశీలి‌స్తున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.


లైవ్ టీవి


Share it
Top