నల్లకుంట శంకరమఠంలో చోరీ..ఇంటి దొంగల పనేనా..!

నల్లకుంట శంకరమఠంలో చోరీ..ఇంటి దొంగల పనేనా..!
x
Highlights

హైదరాబాద్ నల్లకుంటలోని శృంగేరీ పీఠం ప్రధాన కేంద్రం శంకరమఠంలో దొంగలు పడ్డారు. 18 లక్షల విలువైన బంగారు ఆపహరణకు గురయ్యాయి. చోరీ జరిగిన విషయాన్ని...

హైదరాబాద్ నల్లకుంటలోని శృంగేరీ పీఠం ప్రధాన కేంద్రం శంకరమఠంలో దొంగలు పడ్డారు. 18 లక్షల విలువైన బంగారు ఆపహరణకు గురయ్యాయి. చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన వెంటనే మఠం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మఠం సిబ్బందిపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శంకరమఠంలో చోరీ కలకలం రేపుతోంది. ఇంటి దొంగలే దొంగతనానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు క్లర్క్ స్థాయి ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. భక్తులు మొక్కుల రూపంలో సమర్పించుకునే బంగారు ఆభరణాలు భద్రపరిచే గది నుంచి నగలు మాయమైనట్టు మఠం నిర్వాహకులు చెబుతున్నారు. చోరీ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories