ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ బాధ్యతల స్వీకరణ

ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ బాధ్యతల స్వీకరణ
x
Highlights

ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గౌరవ వందనం స్వీకరించారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తనపై గురుతరమైన...

ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో గౌరవ వందనం స్వీకరించారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తనపై గురుతరమైన బాధ్యత ఉంచిందన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ దేశంలోనే అత్యున్నతమైనదన్నారు. అటువంటి దానికి డీజీపీగా రావడం చాలా సంతోషంగా ఉందని సవాంగ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు దేశంలోనే మొదటి స్థానంలో ఎప్పుడూ నిలుస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొందని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా సమర్ధవంతంగా వాటిని ఎదుర్కున్నారని ఇంకా కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉందని గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories