పేలిన గ్యాస్ సిలిండర్...ఐదుగురికి తీవ్ర గాయాలు

పేలిన గ్యాస్ సిలిండర్...ఐదుగురికి తీవ్ర గాయాలు
x
Highlights

అనంతపురం జిల్లా కొత్త చెరువులోని ఓ ఇంట్లో గ్యాస్ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో పాటు ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో 15 రోజుల...

అనంతపురం జిల్లా కొత్త చెరువులోని ఓ ఇంట్లో గ్యాస్ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో పాటు ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో 15 రోజుల పసికందుతో పాటు రెండేళ్ల చిన్నారి, ఎనిమిదేళ్ల బాలిక ఉన్నారు. గ్యాస్ లీకేజీ కారణంగానే ఈ ఘటన సంభవించినట్టు స్ధానికులు చెబుతున్నారు. తెల్లవారుజామున భారీ శబ్ధంతో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్టు స్ధానికులు తెలియజేశారు. గాయపడిన వారిని 108 ద్వారా సమీపంలోని ధర్మవరం ఆసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories