సంక్రాంతికే గంగిరెద్దులవారికి ఆదరణ...మిగతా రోజుల్లో వారి బతుకులు బిక్షాటనే

Gangireddu
x
Gangireddu
Highlights

గతంలో సంక్రాంతి వస్తే వారిని ఎంతో గౌరవంతో చూసేవారు. ఆశీర్వాదం ఇస్తే ఎంతో ఆనందించేవారు. ఉదారంగా దానధర్మాలు చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. సంక్రాంతి వారి రాక నామ్ కే వస్తేగా అన్నట్లుగా మారింది. రాను రాను ఆదరణ కోల్సోతున్న గంగిరెద్దులను ఆడించేవారిపై స్పెషల్ స్టోరీ.

గతంలో సంక్రాంతి వస్తే వారిని ఎంతో గౌరవంతో చూసేవారు. ఆశీర్వాదం ఇస్తే ఎంతో ఆనందించేవారు. ఉదారంగా దానధర్మాలు చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. సంక్రాంతి వారి రాక నామ్ కే వస్తేగా అన్నట్లుగా మారింది. రాను రాను ఆదరణ కోల్సోతున్న గంగిరెద్దులను ఆడించేవారిపై స్పెషల్ స్టోరీ.

సంక్రాంతి అంటే భోగి మంటలు, రంగవల్లులు, పిండి వంటలు కాగా గంగిరెద్దులవారు రాకతో పండుగ సందడి నెలకొంటుంది. అమ్మవారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల చేత జనానికి దండం పెట్టించడంతో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతోంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రాజపురం గ్రామంతో పాటు చుట్టుపక్కల ఊళ్లలో గంగిరెద్దుల కుటుంబాలు వున్నాయి. మహబూబాబాద్ జిల్లా డోర్నకలు మండలం కన్నెగుండ్ల గ్రామంలో కూడా నివసిస్తున్నాయి. తమ పూర్వికుల నుంచి వారసత్వంగా వస్తున్న గంగిరెద్దుల ఆటతో జీవనం సాగిస్తున్నాయి.

ఒక్కో గంగిరెద్దు ఖరీదు 30 నుంచి 60 వేల దాకా ఉంటుంది. తాము నివాసం ఉండే చోట ఎద్దులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు గంగిరెద్దులవారు. రంగు రంగుల బట్టలతో కుట్టిన బొంతలను ఎద్దులపై కప్పుతారు. కొమ్ములకు ఎర్రటి వస్త్రం చుట్టి, ఇత్తడి గజ్జెలు అలంకరిస్తారు. ఏటా సంక్రాంతి వారానికి ముందు గంగిరెద్దులవారి రాక ప్రారంభం అవుతోంది. ప్రతి గంగిరెద్దు వెంబడి ఇద్దరు లేదా ముగ్గురు వుంటారు. డోలు, సన్యాయిలు వాయిస్తూ గంగిరెద్దుల చేత విన్యాసాలు చేయిస్తారు. కనుమ వరకు కొనసాగే బిక్షాటన కొనసాగిస్తారు. జనం తమ ఇళ్లలోనున్న బియ్యం, వస్త్రాలు లేదా ధనం గంగిరెద్దులవారికి ఇచ్చుకుంటారు.

గతంలో సంక్రాంతికి వచ్చే గంగిరెద్దులవారికి జనం ప్రత్యేక గౌరవంతో ఇచ్చేవారు. ఎంతో భక్తితో గంగిరెద్దుల ఆశీర్వాదం తీసుకునేవారు. గంగిరెద్దుల విన్యాసాలు చూసి మురిపిపోయేవారు. ఎంతో ఉదారంతో ఇచ్చే బియ్యంతో గంగిరెద్దుల కుటుంబాల ఆరు నెలల జీవనం నడిచేది. రాను రాను గంగిరెద్దులవారికి ఆదరణ తగ్గుతోంది. ఇప్పుడు బియ్యానికి బదులు తమకు తోచినరీతిలో డబ్బులు ఇస్తున్నారు.

గంగిరెద్దులవారు సంచార జీవులు. ఏడాదిలో నాలుగు నెలల పాటు గ్రామాలు, పట్టణాలు తిరుగుతారు. మిగతా రోజుల్లో కొందరు కూలీకి వెళితే, మరికొందరు వ్యవసాయం చేసుకుంటారు. భూమి లేనివాళ్లు గంగిరెద్దులతో కలిసి బిక్షాటన కొనసాగిస్తారు. ఇప్పుడు రోజుకు కనీసం మూడు వందల రూపాయలు కూడా రావడంలేదని వాపోతున్నారు.

సంక్రాంతిలో ఆధ్యాత్మిక వాతావరణం తీసుకొచ్చే గంగిరెద్దులవారి జీవనం దుర్భరంగా మారుతోంది. ప్రభుత్వం ఈ వృత్తిని ప్రోత్సహించకపోతే రానున్న కాలంలో సంక్రాంతికి గంగిరెద్దులు కనిపించకుండాపోయే ప్రమాదం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories