రైతులపేరిట నకిలీ ఖాతాలు..రూ.కోటి స్వాహా!

రైతులపేరిట నకిలీ ఖాతాలు..రూ.కోటి స్వాహా!
x
Highlights

కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం పరిటాలలో బ్యాంకు ఉద్యోగి చేతివాటం బయటపడింది. రైతులు లోన్ కోసం తమ వద్ద ఉన్న బంగారాన్ని ఎస్‌బీఐలో పెట్టగా ఆ బ్యాంకులో...

కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం పరిటాలలో బ్యాంకు ఉద్యోగి చేతివాటం బయటపడింది. రైతులు లోన్ కోసం తమ వద్ద ఉన్న బంగారాన్ని ఎస్‌బీఐలో పెట్టగా ఆ బ్యాంకులో పనిచేసే క్యాషియర్ శ్రీనివాసరావు చేతివాటం చూపించాడు. రైతులు లోన్‌ కోసం పెట్టిన బంగారానికి రెట్టింపు రుణం తీసుకున్నాడు శ్రీనివాసరావు. దీని కోసం 90 నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి కోటి రూపాయలు స్వాహా చేసినట్టు అనుమానిస్తున్నారు. రైతులు రెండు రోజులుగా బంగారం కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా సర్వర్లు పనిచేయడం లేదని దాటవేశారు. అయితే గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయట పడింది. క్యాషియర్ శ్రీనివాసరావు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలిసిన తర్వాత బంగారం తిరిగి ఇచ్చేస్తామని బ్యాంకు మేనేజర్‌ రైతులకు హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories