logo

ఏడుకు చేరిన కోదాడ ప్రమాదం మృతుల సంఖ్య

ఏడుకు చేరిన కోదాడ ప్రమాదం మృతుల సంఖ్య

సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం క్రాస్ రోడ్డులో ఓ ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో మొత్తం ఐదుగురు మహిళలతో సహా ఏడుగురు మృతి చెందారు. మృతులు నాగసులోచన, లక్ష్మయ్య దంపతులు, సుగుణ, శైలజ,సైదమ్మ, అబ్బాస్‌లుగా గుర్తించారు. తమ్మర గ్రామంలో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కోదాడ ఖమ్మం క్రాస్‌రోడ్డు వద్ద సిమెంట్ లారీ, ఆటోను ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.

???? ????

Share it
Top