ఏపీలో మధ్యాహ్నం 2గంటలకు తొలి ఫలితం!

ఏపీలో మధ్యాహ్నం 2గంటలకు తొలి ఫలితం!
x
Highlights

ఎన్నికల కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది తెలిపారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్న ద్వివేది...

ఎన్నికల కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది తెలిపారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందన్న ద్వివేది మొదట పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 2గంటల వరకు ఫలితం తేలిపోతుందన్నారు.

కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడెంచల భద్రతను ఏర్పాటు చేసినట్లు ఏపీ సీఈవో ద్వివేది తెలిపారు. 25వేల మంది కౌంటింగ్ సిబ్బంది, 25 వేల మంది సాయుధ బలగాలు కౌంటింగ్ విధుల్లో ఉంటారని వెల్లడించారు. వీళ్లతోపాటు అదనంగా 45 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు కౌంటింగ్ కేంద్రాల దగ్గర అందుబాటులో ఉంటాయన్నారు.

ఈసీ తరపున ఇద్దరు ప్రత్యేక పరిశీలకులు ఏపీలో అందుబాటులో ఉంటారని, అలాగే ప్రతి కౌంటింగ్ కేంద్రం దగ్గర ఇద్దరు బెల్ ఇంజినీర్లు అందుబాటులో ఉంటారని ద్వివేది తెలిపారు. ఇక ప్రతి అసెంబ్లీకి ఒక పరిశీలకుడు, పార్లమెంట్‌కి మరో పరిశీలకుడు అందుబాటులో ఉన్నారన్నారు. రౌండ్ రౌండ్‌కు ఫలితాలు వెల్లడించనున్నట్లు ద్వివేది తెలిపారు.

వీవీప్యాట్ల లెక్కింపు కేవలం వెరిఫికేషన్ కోసం మాత్రమేనన్నారు ఏపీ సీఈవో ద్వివేది. అసెంబ్లీ, లోక్‌సభలకు వేర్వేరుగా వీవీప్యాట్లను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి లెక్కింపు చేపడతామన్నారు. ఒకవేళ ఏదైనా ఈవీఎం మొరాయిస్తే వీవీప్యాట్ల స్లిప్పులను కౌంటింగ్ చేయనున్నట్లు ద్వివేది స్పష్టంచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories