సుప్రీంకోర్టులో అనిల్ అంబానీకి షాక్

సుప్రీంకోర్టులో అనిల్ అంబానీకి షాక్
x
Highlights

కోర్టు ధిక్కరణ కేసులో రిలయన్స్ కమ్యూనికేషన్ చైర్మన్ అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. రూ. 550 కోట్ల...

కోర్టు ధిక్కరణ కేసులో రిలయన్స్ కమ్యూనికేషన్ చైర్మన్ అనిల్ అంబానీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. రూ. 550 కోట్ల బకాయిలను చెల్లించే ఉద్దేశం ఆర్‌కాంకు లేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎరిక్సన్ ఇండియాకు నాలుగు వారాల్లోపు 453 కోట్లు చెల్లించాలని లేనట్లయితే మూడు నెలల జైలు శిక్ష తప్పదని కోర్టు హెచ్చరించింది. జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారీమన్‌, జస్టిస్‌ వినీత్‌ సహరన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. దీంతోపాటు అనిల్‌ అంబానీ, రిలయన్స్‌ టెలికాం ఛైర్మన్‌ సతీష్‌ సేత్‌, రిలయన్స్‌ ఇన్ఫ్రాటెల్‌ ఛైర్‌పర్సన్‌ ఛాయా విరానీలు తలా కోటి రూపాయలు అపరాధ రుసుం చెల్లించాలని పేర్కొంది. తక్షణమే చెల్లించనట్లయితే నెలరోజుల పాటు జైలు కెళ్లాల్సి ఉంటుందని తీర్పు వెలువరించింది కోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories