ప్రచారానికి మిగిలింది కొన్ని గంటలే...నేతల ఉరుకులు పరుగులు...

ప్రచారానికి మిగిలింది కొన్ని గంటలే...నేతల ఉరుకులు పరుగులు...
x
Highlights

ప్రచారానికి మిగిలింది ఇంక కొన్ని గంటలే పార్టీల నేతలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ప్రచార సభలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం...

ప్రచారానికి మిగిలింది ఇంక కొన్ని గంటలే పార్టీల నేతలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ప్రచార సభలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వరాల జల్లులు కురిపిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌కు సమయం దగ్గరపడుతోంది. ప్రచారానికి కొన్నిగంటలే మిగిలి ఉంది. ఉన్న కొద్ది సమయంలో నియోజకవర్గాలను చుట్టేసేందుకు నేతలు పరుగులు పెడుతున్నారు. పోలింగ్ తేదీకి 48 గంటల ముందుగానే మంగళవారం సాయంత్రం 6 గంటల వరకే రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముగించాల్సి ఉంటుంది.

దేశ వ్యాప్తంగా మొత్తం ఏడు విడతల్లో పోలింగ్‌ జరగనుండగా తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకూ, ఏపీలో 175 శాసన సభ , 25 ఎంపీ స్థానాలకు ఈ నెల 11న తొలి విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో 17 స్థానాలకుగాను మొత్తం 443 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఒక్క నిజామాబాద్‌ నుంచి 185 మంది బరిలో ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఓట్లర్లకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ప్రత్యర్దులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. తెలంగాణాలో 16 పార్లమెంట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం చేసింది. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఎంపీ అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్, బిజెపి అగ్ర నేతలతో పాటు స్థానిక నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు.

ఏపీలోనూ ప్రచారం హోరెత్తింది. సీఎం చంద్రబాబు అలుపెరగకుండా సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ఎంపీ, శాసన సభ అభ్యర్థులు తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు సభలు, రోడ్ షోలు జరుపుతున్నారు. అటు షర్మిల, విజయమ్మలు కూడా రోడ్ షోలలో ప్రసంగిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం ముమ్మరం చేశారు. ఏపీలో కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు ఎన్నికల ప్రచారం జోరుగా సాగిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories