వెలుగులోకొచ్చిన రూ. 1000 కోట్ల భారీ స్కాం

వెలుగులోకొచ్చిన రూ. 1000 కోట్ల భారీ స్కాం
x
Highlights

కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మల్టీ లేవల్ మార్కెటింగ్ పేరుతో అడ్డంగా దొచుకుంటున్నారు. వివిధ పేర్లతో కంపేనీలను క్రియేట్ చేసి అమాయకులను బుట్టలో...

కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మల్టీ లేవల్ మార్కెటింగ్ పేరుతో అడ్డంగా దొచుకుంటున్నారు. వివిధ పేర్లతో కంపేనీలను క్రియేట్ చేసి అమాయకులను బుట్టలో పడేస్తున్నారు. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రెండు లక్షలు సంపాదించోచ్చని నమ్మిస్తారు. మల్టీ లేవల్ మార్కెటింగ్ పేరుతో జరిగే మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్యూనెట్ సంఘటన మరువకముందే తాజాగా మరో మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం బయట పడింది. మాదాపూర్ లో ఈబిజ్ పేరుతో మల్టీలెవల్ మార్కెటింగ్ దందా చేస్తున్న ప్రధాన సూత్రదారుడు పవన్ మల్హాన్ ను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు.

మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో జరిగే మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరకాయ, క్కూనెట్ పేర్లతో మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలు చేసిన సంఘటనలు మరువకముందే తాజాగా హైటెక్ సిటీ అడ్డాగా మరో భారీ మల్టేలెవల్ మార్కెటింగ్ మోసం వెలుగు చూసింది. ఈ బిజ్ డాట్ కమ్ ప్రైవేట్ లిమిటేడ్ పేరుతో వెయ్యి కోట్ల వరకు మోసానికి పాల్పడినట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. కంపేనీ ప్రధాన సూత్రదారుడు ఈబిజ్ ఎండీ పవన్ మల్హాన్ ను అరెస్ట్ చేశారు.

పవన్ మల్హాన్ అనే వ్యక్తి 2001 లో ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో ఈబిజ్ డాట్ కమ్ ప్రైవేట్ లిమిటేడ్ పేరుతో ఓ కంపేనీనీ ఏర్పాటు చేశాడు. డైరెక్ట్ బిజినెస్ ప్రొడక్ట్ సేల్ పేరుతో ఈ కంపేనీని మోదట్లో నడిపించాడు. ఇలా దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో ఈబిజ్ ని ఏర్పాటు చేశాడు. స్టూడెంట్స్, రిటైర్ట్ ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలనే టార్గేట్ చేసుకున్నాడు కంపేనీ ఎండి పవన్. ఆకట్టుకునే ప్రకటనలు ఇస్తూ నమ్మించాడు. తమ కంపేనీ వివిధ ప్రొడక్ట్స్ తయారు చేస్తుందని తమ కంపేనీలో మెంబర్ గా జాయిన్ అయ్యి వాటిని అమితే లక్షలు సంపాదించుకోవచ్చని నమ్మించాడు. ప్రొడక్ట్స్ మాత్రమే కాదు ఎడ్యూకేషనల్ కు సంబంధించిన మల్టీ కోర్సులకు కూడా తక్కువ ధరకే ప్యాకేజీ ఉంటుందని సెమినార్లు పెట్టి లక్షలాది మందిని బురిడి కోట్టించాడు. ఇలా దేశ వ్యాప్తంగా ఈబిజ్ కంపేనీలో 7 లక్షల మందిని మెంబర్లుగా జాయిన్ చేసుకుని 1000 కోట్ల వరకు వసూలు చేసి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

తీగలాగితే డొంక కదిలినట్లు ఒక్క పిర్యాదుతో ఈ బిజ్ పేరుతో నడుపుతున్న మల్లీలెవల్ మార్కెటింగ్ దందా గుట్టురట్టు అయ్యింది. డిగ్రి చదువుతున్న వివేక్ కొందరు స్నేహితులతో ఈబిజ్ నిర్వహించిన సెమినార్ కు హాజరు అయ్యాడు. కంపేనీలో పెట్టుబడి పెట్టిన సంవత్సరానికే రెట్టింపు అవుతుంది అనడంతో ప్రకటనలకు ఆకర్షితుడైన వివేక్ ఈబిజ్ 16 వేల రూపాయలను పెట్టాడు. కొద్ది రోజుల తర్వాత కట్టిన డబ్బు ఇవ్వమంటే మరికొందరిని ఈ కంపేనీలో చేర్పిస్తేనే డబ్బుతోపాటు కమీషన్ ఇస్తామడంతో మోస పోయానని గుర్తించిన వివేక్ మాదాపూర్ పోలీసులకు పిర్యాదు చేశాడు. రంగంలో దిగిన పోలీసులు ఈబిజ్ కంపేనీ మల్టేలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ బిజ్ ను నడిపిస్తున్న ఎండీ పవన్ ను అరెస్ట్ చేసి బ్యాంక్ అకౌంట్లో ఉన్న 70 కోట్ల డబ్బును ప్రీజ్ చేశారు. ఈ బిజ్ కంపేనీపై కూడా చాలా కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మల్టీలెవల్ మార్కెటింగ్ కంపేనీలో పెట్టుబడులు పెడితే తిరిగి డబ్బులు రావని కేసులు నమోదై ఒకవేళ రికవరైన డబ్బు ప్రభుత్వానికి వెళ్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కవ డబ్బులు సంపాదించవచ్చు అని చెపే ప్రకటనలు నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories