Top
logo

ఫుల్లుగా మద్యం తాగి నోట్లో పర్‌ఫ్యూమ్ స్ప్రే కొట్టుకున్నాడు..!

ఫుల్లుగా మద్యం తాగి నోట్లో పర్‌ఫ్యూమ్ స్ప్రే కొట్టుకున్నాడు..!
X
Highlights

'మద్యం' సాయంత్రం అయిందంటే మద్యం బాబులకు పాణం లాగేస్తుంటది. మద్యం మత్తులో నానా హంగామా చేస్తుంటారు మందుబాబులు. ...

"మద్యం" సాయంత్రం అయిందంటే మద్యం బాబులకు పాణం లాగేస్తుంటది. మద్యం మత్తులో నానా హంగామా చేస్తుంటారు మందుబాబులు. డ్రైవింగ్ చేయాలన్న ముచ్చట కూడా యాదీ రాదు. ఫుల్ గా మందుకొట్టడం పూర్తయ్యాక కానీ వాళ్లకు డ్రైవింగ్ విషయం గుర్తుకు రాదు. ఇక ఎలాగోలా మద్యం ఫుల్లుగా సేవించి బయటకు వోస్తారు. తమ కారు, బైకును నడపలేని పరిస్థితిలో ఉన్నమని తెలిసిన కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇక ఏలాగోలా డ్రైవింగ్ చేస్తూ ఇంటి గమ్యంనికి చేరుదాం అనుకుంటారు కానీ మధ్యలో గాచారం బాగోలేకపోతే ఏం చేయలేని పరిస్థితి, డ్రైవింగ్ చూస్తూ పోలీసులకు దొరికినమే అనుకో ఇక అంతే సంగతులు.

ఇలాగే యూఎస్‌లోని సౌత్ కరోలినాకు చెందిన ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం తాగి తన కారులో వెళ్తున్నాడు. ఇంతలో తన ముందు పోలీసు ఉన్నడని దూరం నుండే గమనించిన మందుబాబు క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే తన దగ్గర ఉన్న ఏక్స్ పర్‌ఫ్యూమ్‌ను తన నోట్లో స్ప్రే చేసుకున్నాడు. ఎందుకనుకుంటున్నారా పోలీసులకు తాగిన వాసన, ఫుల్లపెట్టిన కానీ దొరకుండా ఉండేందుకు ఈ ఉపయం చేసిండు అయితే స్ప్రే కొట్టుకున్నా మనోడు అడ్డంగా బుక్కయ్యాడు. తన వాహనంలో 12 నిండు బీర్లు, 10 ఖాళీ బీర్ల టిన్‌లను గుర్తించారు. అతడికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెట్టడంతో తన ఫుల్లుగా మద్యం తాగినట్లు తేలింది. తన తెలివితో స్ప్రే కొట్టుకున్నా పోలీసులకు చిక్కిండు. వెంటనే పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.

Next Story