logo

మహబూబ్ నగర్‌ బరిలో మాజీ మంత్రి డీకే అరుణ

మహబూబ్ నగర్‌ బరిలో మాజీ మంత్రి డీకే అరుణ
Highlights

కాంగ్రెస్‌కు ఊహించని షాకిస్తూ బీజేపీలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్ధానం నుంచి పోటీకి...

కాంగ్రెస్‌కు ఊహించని షాకిస్తూ బీజేపీలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్ధానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తదుపరి కార్యాచరణ ప్రారంభించారు. జిల్లాలో అటు తన అనుచరణ గణాన్ని, ఇటు బీజేపీ కేడర్ ఏకం చేయాలని భావిస్తున్న ఆమె మహబూబ్‌నగర్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో పాల్గొనాలంటూ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ప్రధాని కూడా సానుకూలంగా స్పందించడంతో ఈ నెల 23 తరువాత బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని సభలోనే కాంగ్రెస్‌కు చెందిన పలువురు ప్రముఖులు బీజేపీలో చేరే అవకాశాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


లైవ్ టీవి


Share it
Top