వాల్మీకి నుండి దేవిశ్రీ అవుట్ .. !

వాల్మీకి నుండి దేవిశ్రీ అవుట్ .. !
x
Highlights

డైరక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వాల్మీకి. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరో. తమిళ సినిమా జిగర్తాండకు ఇది రీమేక్. ప్రస్తుతం సినిమా...

డైరక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వాల్మీకి. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరో. తమిళ సినిమా జిగర్తాండకు ఇది రీమేక్. ప్రస్తుతం సినిమా షూటింగ్ షరవేగంగా జరుపుకుంటుంది . అయితే ఇప్పుడు లేటెస్ట్ గా సినిమా మ్యూజిక్ డైరక్టర్ కూడా మారిపోయారని తెలుస్తుంది . ఇంతకుముందు హీరోయిన్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.

ఇంతకుముందు ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరక్టర్ గా ఫిక్స్ చేసారు . కొత్తగా మిక్కీ జె మేయర్ ని మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకున్నట్లు సమాచారం . 14రీల్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. తమిళంలో సిద్దార్థ చేసిన సినిమా జిగర్తాండ. అప్పట్లోనే ఇది తెలుగులో డబ్ అయింది కానీ, అనేకానేక కారణాల వల్ల విడుదల కాలేదు. ఆ సినిమాను ఇప్పుడు రీమేక్ చేస్తున్నారు. ఇందులో నెగిటివ్ షేడ్ వున్న క్యారెక్టర్ ను వరుణ్ తేజ ఇప్పుడు చేస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories