టిక్ టాక్ యాప్‌ను నిషేధించాలనే దేశ వ్యాప్తంగా డిమాండ్

టిక్ టాక్ యాప్‌ను నిషేధించాలనే దేశ వ్యాప్తంగా డిమాండ్
x
Highlights

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న టిక్ టాక్ యాప్‌ను నిషేధించాలనే డిమాండ్ దేశ వ్యాప్తంగా ఎక్కువయింది. దేశం మొత్తం ఆడియోలు, వీడియోలతో హల్ చల్ చేస్తున్న...

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న టిక్ టాక్ యాప్‌ను నిషేధించాలనే డిమాండ్ దేశ వ్యాప్తంగా ఎక్కువయింది. దేశం మొత్తం ఆడియోలు, వీడియోలతో హల్ చల్ చేస్తున్న టిక్ టాక్ యాప్ ఏ మాత్రం శ్రేయస్కరం కాదనే చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతోంది.

ఈ మధ్యకాలంలో యూత్ బాగా కనెక్ట్ అయిన యాప్‌ల్లో టిక్ టాక్ ఒకటి. ఇది చూడ్డానికి డబ్‌స్మాష్‌లాగానే ఉంటుంది. కానీ ఇందులో మ్యూజికల్ వీడియోస్ ఉంటాయి. డైలాగ్స్, ఎమోషన్స్, సాంగ్స్ ఇలా అన్నీ క్రియేట్ చేసి షేర్ చేసే అవకాశం ఉండటంతో యూత్ దీనికి ఫిదా అయిపోయింది. అయితే ఇందులో అశ్లీల వీడియోలు, అభ్యంతరకర సంభాషణలు కూడా పోస్ట్ కావడంపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ యాప్‌లో వస్తున్న అశ్లీల సంభాషణలు, అభ్యంతర వ్యాఖ్యలతో యువత పెడదోవ పడుతోందని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని భావిస్తోన్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యాప్‌ను నిషేధించేందుకు చర్యలు ప్రారంభించాయి.

ఈ టిక్ టాక్ యాప్ వల్ల కలిగే దుష్ఫరిణామాలపై కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి యాప్‌లను బ్యాన్ చేయాలని కోరుతున్నారు. టిక్ టాక్ యాప్ వల్ల కలిగే నష్టాలను ప్రఖ్యాత ఐటీ నిపుణుడు నల్లమోతు శ్రీధర్ వివరించారు. అటువంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories